తమ్ముడి బర్త్ డేకు కాస్ట్‌లీ గిఫ్ట్.. శ్రీముఖి రచ్చ మామూలుగా లేదు!!
బిగ్ బాస్ షో వల్ల కంటెస్టెంట్లు మాత్రమే కాదు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫేమస్ అవుతుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే కంటెస్టెంట్ల కంటే ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంటారు. అలా మూడో సీజన్‌లో వరుణ్ సందేశ్ బామ్మ, శ్రీముఖి తల్లి, సోదరుడు, పునర్నవి తమ్ముడు.. తనీష్ తమ్ముడు ఇలా చాలా మంది ఫేమస్ అయ్యారు. ఇక నాల్గో సీజన్‌లో అయితే అభిజిత్ తల్లి అందరిక కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారు.

మూడో సీజన్‌లో అలా..
మూడో సీజన్ షోలో కంటెస్టెంట్ల కంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ మరింతగా ఫేమస్ అయ్యారు. అందులో ముఖ్యంగా శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫేమస్ అయ్యారు. శ్రీముఖి తల్లి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి రాహుల్‌పై నెగెటివ్ కామెంట్ చేయడంతో బాగా ఫేమస్ అయింది.

తమ్ముడు అలా..
శ్రీముఖి తమ్ముడు శుశ్రుత్ అయితే ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పోట్లాడి తన అక్కతో మాట్లాడేందుకు రెడీ అయ్యాడు. కానీ ఆ టైంలో శ్రీముఖికి అదృష్టం కలిసి రాలేదు. తమ్ముడితో మాట్లాడకుండానే వెనుదిరిగా రావాల్సి వచ్చింది. ఆ సమయంలో శుశ్రుత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్అయ్యాడు.

ఫినాలె వరకు..
ఇక శ్రీముఖి ఫినాలే వరకు ఉండటం, ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతుండటంతో శుశ్రుత్ అంతా మ్యానేజ్ చేసేశాడు. అలా శ్రీముఖి సోదరుడు అప్పటి నుంచి వార్తల్లో వైరల్ అవుతూనే వచ్చాడు. ఇక శుశ్రుత్‌కు లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే పెరిగింది. తాజాగా శుశ్రుత్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

స్పెషల్ గిఫ్ట్..
తమ్ముడి బర్త్ డే సందర్భంగా శ్రీముఖి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చినట్టుంది. ఈ మేరకు గిఫ్ట్‌లను ఓపెన్ చేస్తూ శుశ్రుత్ ఆశ్చర్యపోయాడు. ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు ఫోటోలను చూస్తే కనిపిస్తోంది. మొత్తానికి తమ్ముడిపై ప్రేమను శ్రీముఖి ఇలా చాటిచెప్పినట్టుంది. ఈ మధ్యే శ్రీముఖి కొత్త ఇంటిని కూడా కట్టేస్తోంది. ఆల్రెడీ పనులు కూడా సగం అయిపోయాయ్. ఆ మధ్య కొత్త ఇంటికి సంబంధించిన పూజా కార్యక్రమాల ఫోటోలను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











