IPL 2026: ఎంఎస్ ధోని టీమ్‌కు కావ్య మారన్ షాక్.. CSKపై కోర్టులో కేసు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ప్రారంభానికి కొద్ది రోజుల ముందే మైదానంలో కాకుండా కోర్టులో యుద్దం మొదలైంది. ఐపీఎల్‌లో టాప్ రేటింగ్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కాపీరైట్ వివాదం నెలకొన్నది. ఈ రెండు జట్ల మధ్య రజనీకాంత్ అంశం చిచ్చు పెట్టింది. రజనీకాంత్‌తో సన్ పిక్చర్స్ నిర్మించిన సినిమాల పాటలు, సన్నివేశాలను ఉపయోగించకుండా ఆంక్షలు విధించింది. జైలర్ సినిమా పాటను వాడుకొన్నందుకు భారీగా నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో CSK జట్టు ఇటీవల చెన్నైలో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జెర్సీని ఆవిష్కరించారు. ఈ సమయంలో జట్టు మెంటర్, ఆటగాడు ఎంఎస్ ధోని ఈ వేడుకలో పాల్గొంటున్న సమయంలో జైలర్ సినిమాలోని హుకుమ్ పాటను ప్లే చేసి వాడుకొన్నారు. దాంతో రజనీకాంత్ నటించిన ఆ సినిమా పాటను వాడుకొన్న వీడియోలు ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి.

అయితే తమ అనుమతి లేకుండా సన్ పిక్చర్స్ నిర్మించిన జైలర్ సినిమా మ్యూజిక్‌ను వాడుకోవడంపై SRH టీమ్ అభ్యంతరాలు తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై CSK జట్టుపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జైలర్, జైలర్ 2, కూలీ సినిమాల పాటలను వాడుకోవద్దు. ఒకవేళ వాడుకొంటే చట్టరీత్యా చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ఈ మేరకు చెన్నై సూపర్ కిగ్స్ జట్టుపై సన్ పిక్చర్స్ సీఈవో కాశీ విశ్వనాథ్, శ్రీధరన్, రాధాకృష్ణన్ శ్రీనివాసన్‌కు నోటీసులు జారీ చేశారు.
జైలర్ పాటను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వాణిజ్య విలువలతో కూడిన ప్రయోజనాల కోసం వాడుకొన్నది. ఆ జట్టు జెర్సీని సుమారుగా 2399 రూపాయలకు అమ్మడం జరిగింది. ఆ జట్టు మా అనుమతి లేకుండా వ్యాపార సంబంధమైన ప్రకటనలకు మా పాటను వాడుకొన్నది. కాబట్టి కాపీరైట్ కిందకు వస్తుంది. ప్రోమోల ద్వారా సంపాదించిన ఆదాయంలో నుంచి మాకు 1 కోటి రూపాయలు నష్టం పరిహారం చెల్లించాలి అని పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వివాదం నేపథ్యంలో జెర్సీ ఆవిష్కరణకు సంబంధించిన ప్రోమోను నిలిపివేసింది. ఈ మేరకు మద్రాస్ కోర్టుకు కూడా తమ వాదనలను ధోని జట్టు మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. ఈ కేసు, పిటిషన్‌ను విచారించేందుకు సమయం కోరింది. ఈ వివాదానికి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనే విషయం గురించి వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య మైదానంలో హోరాహోరీగా పోటీ ఉండబోతుందనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications
















