కంగ్రాట్స్ ఇండియా.. కరోనాకు మందు వచ్చేసింది.. కానీ ఆ స్థితిలో పని చేయదంటూ శ్రీ రెడ్డి పోస్ట్
ప్రపంచం అంతా కరోనా వైరస్ జపం చేస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనాపై పోరాటం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను పాటించాయి కానీ వాటి వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఒనగూరలేదు. రోజురోజుకి కరోనా విజృంభిస్తూనే ఉంది. ఇక చివరకు చేసేది ఏమీ లేక.. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరించాలని, ఇంటి నుంచి అవసరమైతే తప్పా బయటకు రాకుండా ఉండటటే పరిష్కారమని అంతా భావించారు.

వ్యాక్సిన్ కోసం శ్రమ..
ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. దీనిలో భాగంగా మన దేశంలోనూ వ్యాక్సిన్ కోసం ఎన్నో పరిశమ్రలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే తాజాగా అందరికీ ఓ తీపి కబురును చెప్పింది ఓ సంస్థ. కరోనాకు మందు కనిపెట్టామని ప్రకటించింది.

కరోనాకు మందు..
భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనాకు మందు కనిపెట్టినట్టు ప్రకటించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్ కరోనాని దూరం చేస్తుందని ఆ సంస్థ చెప్పుకొస్తుంది. అయితే ఇంకా ట్రయల్స్ చేస్తున్నామని, త్వరలోనే ఈ మందు మార్కెట్లోకి వస్తుందని తెలిపింది.

శ్రీ రెడ్డి స్పందన..
కరోనా వైరస్, లాక్ డౌన్, వలస కూలీలు, ఆకలి చావులు, ప్రభుత్వ నిర్ణయాలపై కామెంట్స్ చేస్తూ వచ్చిన శ్రీ రెడ్డి తాజాగా మరో పోస్ట్ చేసింది. కరోనా వైరస్ కంటే ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని, వలస కూలీలు ప్రాణాలు వదిలేస్తున్నారని అప్పట్లో కామెంట్స్ చేసి తెగ హల్చల్ చేసింది. తాజాగా కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని చెబుతూ ఓ పోస్ట్ చేసింది.
Recommended Video

ఫేక్ కాదు నిజం..
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిందని గ్లెన్ మార్క్ ప్రకటించిన తరువాత ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందించింది. ‘కంగ్రాట్స్ ఇండియా.. కరోనాకు మనం మందు కనిపెట్టాం. కానీ ఇది క్రిటికల్ కండీషన్‌లో ఉన్నవారికి కాదు. ఇది నిజం ఫేక్ కాదు' అని ఓ పోస్ట్ చేసింది. అయితే శ్రీ రెడ్డి చెప్పినట్టుగా ఈ వ్యాక్సిన్ కరోనా ప్రారంభ దశలోనే పని చేస్తుందట. పూర్తి స్థాయి వ్యాక్సిన్ కోసం ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











