ఓ మై గాడ్... ఉపాసన వీడియో చూసి ఆశ్చర్యపోయిన శ్రీరెడ్డి!

Recommended Video

Sri Reddy Comments on Upasana Konidela - Salman Khan Interview || Filmibeat Telugu

రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేగజైన్ రన్ చేస్తున్న ఆమె యూట్యూబ్‌ ఫ్లాట్ ఫాంలో ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సమంతతో పాటు పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.

తాజాగా ఉపాసన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ప్రోగ్రాం చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. ఇలాంటి అవకాశం దక్కడంపై ఉపాసన కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.'' ఓ మై గాడ్... త్వరలో ఫుల్ వీడియో రాబోతోంది'' అంటూ వీడియో డిస్క్రిప్షన్లో పేర్కొన్నారు.

రామ్ చరణ్ హెల్ప్ చేశారా?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంత ఈజీగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఉపాసన ఇంటర్వ్యూకు ఆయన ఒప్పుకోవడానికి కారణం మెగా ఫ్యామిలీతో ఉన్న క్లోజ్ రిలేషన్, రామ్ చరణ్ కోరిక మేరకు ఈ ఇంటర్వ్యూకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూతో ఉపాసన పాపులారిటీ నేషనల్ వైడ్ స్ప్రెడ్ అవ్వడం ఖాయం.

ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రీరెడ్డి

ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రీరెడ్డి

సల్మాన్ ఖాన్‌తో ఉపాసన కార్యక్రమం చేయడంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందించారు. ‘‘ఉపాసన రెడ్డి వావ్'' అంటూ ఆ వీడియో లింక్ షేర్ చేశారు. త్వరలో విడుదల కాబోతున్న పూర్తి వీడియో కోసం శ్రీరెడ్డి సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మెగా ఫ్యామిలీ పేరు నిలబెడుతున్న ఉపాసన

మెగా ఫ్యామిలీ పేరు నిలబెడుతున్న ఉపాసన

మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగు పెట్టిన తర్వాత ఉపాసన తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటు ఇంటి కోడలిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అటు తన పుట్టింటి వారి అపోలో వ్యవహారాలను లీడ్ చేస్తున్నారు. ఉపాసన ‘బి పాజిటివ్' స్థాపించడం వెనక రామ్ చరణ్ చరణ్ ప్రోత్సాహం కూడా ఉందట.

పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ

పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ

రామ్ చరణ్ ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే మనిషి. అటు ఉపాసన కూడా తన వ్యాపారాల్లో తలమునకలై ఉంటారు. భార్య భర్తలుగా ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వీరు ఆఫ్రికా పర్యనటకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X