నా ప్రియైమైన శత్రువు.. నీ చావును నేనే.. శ్రీ రెడ్డి పోస్ట్ వైరల్
శ్రీ రెడ్డి ఈ పేరే ఒక సంచలనం. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది శ్రీ రెడ్డి. మా సభ్యత్వం కోసం రగడ, ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్దనగ్న ప్రదర్శన, దగ్గుబాటి అభిరామ్, నాని వంటి హీరోలపై ఆరోపణలు చేయడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఆపై పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించడం, కోలీవుడ్‌కు వెళ్లి సెటిల్ అవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యన మాత్రం మళ్లీ సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి నానా రచ్చ చేస్తోంది. ఈ మేరకు రోజుకో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తోంది.

పోస్ట్‌లు వైరల్..
శ్రీ రెడ్డి చేసే పోస్ట్‌లు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్, నాగబాబు, పూనమ్ కౌర్, మాధవీలత, రాకేష్ మాస్టర్ వంటి వారిపై నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా పూనమ్ కౌర్, మాధవీలతలపై సంచలన కామెంట్స్ చేస్తూ వస్తోంది.

వివాదాస్పద కామెంట్స్..
శ్రీ రెడ్డి నిత్యం వివాదాస్పద కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆ మధ్య మాధవీలత-సాధినేని యామిని గొడవలో దూరి నానా రచ్చ చేసింది. సాధినేనికి మద్దతిస్తూ మాధవీలతపై తీవ్ర పదజాలాన్ని ప్రయోగించింది. మళ్లీ పూనమ్ కౌర్-పవన్ కళ్యాణ్ వివాదంలోకి దూరి.. సంచలన కామెంట్స్ చేసింది. కడుపు చేయించుకుందని, భరణం తీసుకుందని ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేసింది.

నాగబాబు-బాలయ్య వివాదంలోనూ..
ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన బాలయ్య కామెంట్స్, నాగబాబు కౌంటర్స్‌పై శ్రీ రెడ్డి స్పందించింది. బాలయ్యకు మద్దతిస్తూ నాగబాబును ఏకిపారేసింది. మెగా ఫ్యామిలీ ఆధిపత్యంపై సెటైర్స్ వేసింది. బాలయ్యకే తన మద్దతని తెలిపింది.

బర్త్ డే వేడుకలకు దూరం..
శ్రీ రెడ్డి తన బర్త్ డే అని ముందుగానే అందరికీ పేర్కొనడం, చివరి నిమిషంలో వేడుకలు రద్దు చేసుకున్నట్టు ప్రకటించడం జరిగింది. అయితే తమిళ నాడులో నెలకొన్న పరిస్థితులు, అక్కడి ప్రజలు కరోనాకు భయపడుతూ ఉండటం.. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరపడం తనకు ఇష్టం లేదని తెలిపింది.
Recommended Video

నీ చావును నేనే..
అయితే తాజాగా శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘నీ చావును నేనే.. నా ప్రియమైన శత్రువు.. నీ పనులన్నీ త్వరగా చేసుకో.. సమయం గడిచిపోతోంది'అని పోస్ట్ చేసింది. అయితే ఆ శత్రువు ఎవరు? ఎందుకు ఈ కామెంట్ చేసిందో మాత్రం తెలియడం లేదు. మరి ఆ శత్రువు ఎవరో త్వరలోనే చెబుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











