క్యాస్టింగ్ కౌచ్‌పై నందినీ కామెంట్స్..నీ గురించి నాకు బాగా తెలుసు..అంటూ టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్, మీటూ ప్రపంచ సినీ పరిశ్రమను ఎంతగా కుదిపేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకాశాల కోసం వచ్చిన హీరోయిన్లను తమ అవసరాలను తీర్చమనే సంస్కృతిపై వ్యతిరేకంగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం మొదలైంది. హాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో హల్చల్ చేయగా.. తనూ శ్రీ దత్తాతో బాలీవుడ్‌కి పాకింది. ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై ఆరోపణలు చేయడంతో ఇండియాలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌కు తెరదీసింది. ఇలా అన్ని భాషల ఇండస్ట్రీలో వ్యతిరేక నినాదాలు వెలిశాయి. ఇక టాలీవుడ్‌లో వీటిపై శ్రీ రెడ్డి గొంతెత్తింది.

Recommended Video

Sri Reddy vs Nandini Rai
అర్దనగ్న ప్రదర్శనతో..

అర్దనగ్న ప్రదర్శనతో..

క్యాస్టింగ్ కౌచ్, మీటూ పేరిట తనను మోసం చేశారని, దగ్గుబాటి సురేష్ తనయుడు అభిరామ్ తనను వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉందని పలువురి పేర్లను బయటకు తీసింది. అప్పట్లో ఈ వార్తలు సంచలనం సృష్టించింది. చివరకు శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనతో పీక్స్‌కు చేరింది.

క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా..

క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా..

శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని, కావాలనే ఇవ్వరని ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించింది. కోలీవుడ్‌లోని ప్రముఖులపైనా శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. అవకాశాల కోసం వెళ్లిన వారిని కోరికల పేరిట హింసిస్తారని చెప్పుకొచ్చింది.

నందినీరాయ్ కామెంట్స్..

నందినీరాయ్ కామెంట్స్..

హలో యాప్ నిర్వహించిన లైవ్ కార్యక్రమంలో నందినీ రాయ్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ.. అడిగేవాళ్లు అడుగుతారని అంతా అమ్మాయి ఇష్టమేనని చెప్పుకొచ్చింది. ఒక అమ్మాయి వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది.. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుందని తెలిపింది. ఎప్పుడూ ఎవరు ఎవరినీ ఫోర్స్ చేయరనీ, తాను కళ్లతో చూశాను కాబట్టి చెబుతున్నానని తెలిపింది.

నీ గురించి తెలుసు బుజ్జి..

నీ గురించి తెలుసు బుజ్జి..

నందినీ రాయ్ కామెంట్స్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. ‘ఓ అమ్మాయి పని కోసం వెళ్లింది.. అలాంటప్పుడు సెక్స్ కావాలని ఎవరైనా అడిగితే అది క్యాస్టింగ్ కౌచ్ అవుతుంది నందిని.. కానీ మనమే డైరెక్ట్‌గా ఆఫర్ చేస్తే అది క్యాస్టింగ్ కౌచ్ కాదు.. నీ గురించి నాకు బాగా తెలుసు.. నువ్ నా స్నేహితురాలివి.. అది మరిచిపోకు బుజ్జి' అంటూ శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X