‘పీకే’మాస్క్‌పై రగడ.. పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి

శ్రీరెడ్డి ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. వారు వీరు అని తేడా లేకుండా ఎవరి మీద పడితే వారి మీద సెటైర్స్ వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ సెలెబ్రిటీలపై శ్రీ రెడ్డి నిత్యం కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయనకు వత్తాసుగా మాట్లాడేవారిపై తీవ్రంగా దూషణలకు దిగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్‌ల విషయం ఎప్పుడైతే సెన్సేషన్‌గా మారిందో.. అప్పటి నుంచి శ్రీ రెడ్డి ఆమెను టార్గెట్ చేస్తూనే వస్తోంది. తాజాగా మరోసారి పూనమ్ కౌర్‌పై సెటైర్స్ వేసింది.

Recommended Video

Sri Reddy Post On Poonam Kaur Over PK Mask
 నాటి నుంచి పవన్‌పై..

నాటి నుంచి పవన్‌పై..

క్యాస్టింగ్ కౌచ్, మీటూ పేరిట తనను మోసం చేశారని అప్పట్లో మీడియా ముందు నానా హంగామా చేసింది శ్రీ రెడ్డి. చివరకు ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్దనగ్న ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, చట్టపరంగా వెళ్లాలని మీడియాతో చెప్పుకొచ్చాడు.

టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..

టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..

పవన్ కళ్యాణ్ అలా అనడంతో శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించింది. నాటి నుంచి సందర్భం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ విషయాన్ని కత్తి మహేష్ బయట పెట్టడంతో.. ఆమెను కూడా టార్గెట్ చేస్తూ వస్తోంది.

పూనమ్ కౌర్ వింత ట్వీట్స్...

పూనమ్ కౌర్ వింత ట్వీట్స్...

పూనమ్ కౌర్ చేసే ట్వీట్స్ ఏ ఒక్కరికి అంత స్పష్టంగా అర్థం కావు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్టుగా ట్వీట్స్ వేస్తుంది. పరోక్షంగా జల్సా, అజ్ఞాతవాసి, పవర్, నాయకుడు అంటూ ఇలా ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా పీకే లవ్ అనే మాస్క్‌ను కొంతమంది అభిమానులు తయారుచేయించారని, అవి తనకు పంపించారని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

మాస్క్‌పై కౌంటర్..

మాస్క్‌పై కౌంటర్..

అయితే పీకే లవ్ అంటే.. పూనమ్ కౌర్ లవ్ అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చింది. కానీ కొన్ని సార్లు ఆమె చేసిన కామెంట్స్, పీక్ లవ్ అని హ్యాష్ ట్యాగ్ జోడించడం చూస్తే అవి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినట్టుగా ఉంటాయి. తాజాగా ఆ పీకే మాస్క్‌పై శ్రీ రెడ్డి కౌంటర్ వేసింది.

దాని వెనకాల ఏముంది?

దాని వెనకాల ఏముంది?

పూనమ్ కౌర్ పీకే మాస్క్ ధరించడంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేస్తూ.. ‘పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??' అంటూ పోస్ట్ చేసింది. మరి దీనిపై పూనమ్ స్పందిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X