అది ఎవ్వర్నీ వదిలి పెట్టదు.. కర్మ సిద్దాంతంపై రియల్ స్టోరీ చెప్పిన శ్రీరెడ్డి
శ్రీ రెడ్డి ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, కాంట్రవర్సీలు క్రియేట్ చేసినా కర్మ సిద్దాంతాన్ని నమ్ముతూ ఉంటుంది. శ్రీ రెడ్డి దైవ భక్తి కూడా ఎక్కువే. కాళీ మాతను ఆరాధిస్తూ ఉంటుంది. పైగా వారంలో మూడు నాలుగు రోజులు ఉపావాసం కూడా ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన పోస్ట్‌లు కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా కర్మ సిద్దాంతానికి తన జీవితంలో ఓ స్నేహితురాలికి జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..
శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఆమె చేసే కామెంట్లు ఒక్కోసారి రాయడానికి కూడా వీలుపడదు. అంతటి పరుష పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంది. ఈ మధ్య కాస్త సైలెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది.

స్నేహితురాలి కథ..
తాజాగా శ్రీ రెడ్డి తన స్నేహితురాలి జీవితంలో జరిగిన కథను వివరించింది. ‘నా ఫ్రెండ్స్‌లోని ఓ ముస్లిం స్నేహితురాలు.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ అతను పరమ దుర్మార్గుడు. వారిద్దరికీ ఓ బేబీ పుట్టాక ఆమె భర్త రియల్ ఎస్టేట్‌లో దొంగగా మారాడు. భార్యతో అందర్నీ మోసం చేయడం ప్రారంభించాడు.

వదిలేసింది..
అతని ఇంటి యజమానిని కోట్లల్లో ముంచాడు. అతనో స్త్రీ లోలుడు. అతను పని చేసిన ప్రతీ చోటా అమ్మాయిలను లొంగపర్చుకునేవాడు. వారి దగ్గరి నుంచి డబ్బులు కాజేసేవాడు. చివరకు ఆ ముస్లిం మహిళ తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు అతడ్ని వదిలేసింది. చిన్న పాపను పట్టుకుని బయటకు వచ్చింది. ఆమె ఎన్నో శాపాలు పెట్టింది.

రెండో పెళ్లి..
చివరకు ఓ సేల్స్ గర్ల్ మళ్లీ అతని జీవితంలోకి వచ్చింది. ఆమెకు కూడా అది రెండో పెళ్లే. ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె కూడా పరమ దుర్మర్గురాలు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అతనికి బిజినెస్‌లో నష్టం వచ్చి, భార్యతో పడలేక ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు.
Recommended Video

కర్మ వదిలిపెట్టదు..
ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమస్యల నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నాడు. ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ల శాపం అతనికి తగిలింది. దీన్నే కర్మ అంటారు. మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు' అని శ్రీ రెడ్డి ఓ సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











