విడాకుల సంఖ్య పెరగడానికి కారణమదే.. నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
శ్రీరెడ్డి ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో ఎవరి మీద విరుచుకు పడుతుందో చెప్పడం కష్టం. ఆమె చేసే కామెంట్స్, పోస్ట్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్‌ను షేక్ చేసింది. దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్, నాని, లారెన్స్ వంటి వారిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాణ్‌నూ వ్యక్తిగతంగా దూషించింది. ఈ మేరకు కొన్ని రోజుల వరకు సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నిత్యం పోస్ట్‌లు పెడుతూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూనే ఉంది. తాజాగా మరో పోస్ట్ చేసింది.
Recommended Video

దాని వెనకాల ఏముంది?
పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయంలోనైనా శ్రీ రెడ్డి తలదూర్చుతుంది. రీసెంట్‌గా పూనమ్ కౌర్ పీకే మాస్క్ ధరించడంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేసింది.‘పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??' అంటూ పోస్ట్ చేసింది. పూనమ్ కూడా గట్టిగానే కౌంటర్ వేసింది.

లైవ్‌లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..
ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగా నందమూరి వివాదం నడుస్తున్న విషయం తెలిసింది. ప్రభుత్వాలతో సినీ పెద్దలు భేటీ అవ్వడం, అందులో చిరు చురుకైన పాత్ర పోషించడం అందరికీ తెలిసిందే. ఈ విషయాలపై బాలకృష్ణ తీవ్రస్థాయిలో కామెంట్స్ చేయడం వాటికి ప్రతిస్పందనగా నాగబాబు విమర్శించడం ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది. ఈ విషయంపై శ్రీ రెడ్డి తాజాగా లైవ్‌లోకి వచ్చి ఫైర్ అయింది.

బాలకృష్ణకు మద్దతుగా..
బాలకృష్ణను ఉద్దేశించి మీరేం కింగ్ కాదు.. కేవలం హీరో అని సంబోధించిన నాగబాబుపై ఫైర్ అయింది. ఆయన కింగే మీరు బొంగు అంటూ తెగ రెచ్చిపోయింది. చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టడం ఏంటి? ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేదా ఫిల్మ్ ఛాంబర్ లేదా మా అసోసియేషన్ లేదా అని ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

ఆమే స్పూర్తి..
సినీ రాజకీయ సామాజికి అంశాలపై స్పందించే శ్రీ రెడ్డి తాజాగా.. ప్రథమ స్వతంత్ర సమర యోధురాలు గురించి చెప్పుకొచ్చింది. కన్నడకు చెందిన కిట్టూరు రాణి చెన్నమ్మ గురించి తెలుసుకోవడం ఎంతో గర్వంగా ఉందని, ఆమే నాలోని చివరి శ్వాస వరకు స్ఫూర్తిని నింపుతుందని తెలిపింది.

అందుకే విడాకులు..
మరో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి విడాకులు పెరిగిపోవడానికి గల కారణం ఏంటో వివరించింది. ‘నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అయితే ఆకర్షణ మాత్రం మధ్యలోనే అంతం అవుతుంది.. అందుకే విడాకులు ఎక్కువగా పెరుగుతున్నాయ'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











