శ్రీదేవీ జ్జాపకాల్లో బోనీ కపూర్.. జాన్వీ ఎమోషనల్
స్వర్గీయ శ్రీదేవీ మరణించి నేటికి మూడేళ్లు అవుతోంది. శ్రీదేవీ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంటుంది. ఆమె మరణంపై ఓ సినిమాను కూడా తీశారు. అయితే శ్రీదేవీ జయంతి, వర్దంతి నాడు బోనీ కపూర్ ఫ్యామిలీ అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంటారు. సమయం వచ్చినప్పుడల్లా శ్రీదేవీ తలుచుకుంటూ కపూర్ ఫ్యామిలీ కన్నీరు పెట్టుకుంటుంది. శ్రీదేవీకి మరణానంతరం వచ్చిన జాతీయ అవార్డును తీసుకునే సమయంలో అందరి ముందే బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యాడు.

ఇక శ్రీదేవీ ముద్దుల తనయలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూనే ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా అందరూ ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవీ మూడో వర్దంతి సందర్భంగా చెన్నైలోని ఆమె స్వగృహంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఏడాదిలానే బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలు చెన్నైకి వచ్చారు. శ్రీదేవీ పేరిట పూజా చేశారు.

ఇదే విషయాన్ని జాన్వీ కపూర్ తలుచుకుంటూ ఎమోషనల్ అయింది. అసలే అమ్మ కూచి అయినా జాన్వీ, ఖుషీలు తల్లిని తలుచుకుంటూ బాధపడ్డారు. ఈ మేరకు వారిద్దరు చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. మిస్ యూ అంటూ.. ప్రపంచంలో అందరిలో కెల్లా నువ్వే మంచి బిడ్డవి అంటూ జాన్వీ ఎమోషనల్ అయింది. దుబాయ్‌లో వివాహానికి హాజరైన శ్రీదేవీ.. 2018 ఫిబ్రవరి 24న మరణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications