twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Sridevi: మెరుపులా మాయమైన అతిలోక సుందరి.. మరణం మిస్టరీగానే..

    |

    వెండితెరపైకి అతిలోక సుందరి దిగివచ్చిందేమో అనేంతలా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న నటి శ్రీదేవి. బాలీవుడ్ సైతం ఆమె అందానికి దాసోహం అయ్యింది. చెరగని చిరునవ్వు, ఆకర్షించే నటన ఆమెకు చిన్నతనం నుంచే ఆరో ప్రాణంలా నిలిచాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆమె ఏనాడు తన కష్టాలను చూపించుకోలేదు. ఎన్నో మంచి పనులు కూడా చేసింది. ఇక నేడు అతిలోక సుందరి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే శ్రీదేవి మరణంపై కూడా అనుమానాలు ఏ మాత్రం తగ్గలేవని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

    శ్రీదేవి జననం..

    శ్రీదేవి జననం..

    1963లో ఆగస్టు 13న తమిళనాడులోని మీనన్ పట్టి అనే గ్రామంలో శ్రీదేవి జన్మిచ్చింది. ఆమె తల్లి ఒక నటిగా కొనసాగుతుండగా శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. 1967లోనే కెరీర్ ని స్టార్ట్ చేసింది. నాలుగేళ్ళ వయసులోనే నటనలో రాటు దేలిన శ్రీదేవి 9ఏళ్ళ వయసుకు వచ్చేసరికి తెలుగు, తమిళ్, మళయాళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారింది. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకునేది. ఉదయం స్కూల్ కి వెళ్లి సాయత్రం షూటింగ్స్ తో బిజీగా గడిపేది.

    అద్భుతమైన కెరీర్

    అద్భుతమైన కెరీర్

    1975వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న శ్రీదేవి ఆ తరువాత 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో మూన్రు ముడిచ్చు అనే సినిమాలో నటించింది. అదే సినిమను తెలుగులో కె.రాఘవేంద్రరావు రావ్ పదహరేళ్ళ వయసుగా రీమేక్ చేయగా మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం శ్రీదేవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కినేని, నందమూరి రేండు తరాల హీరోలతో నటించి సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇక మెగాస్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో ఆమె కెరీర్ 1997వరకు సక్సెస్ ట్రాక్ లోనే నడిచింది.

    పెళ్లి.. పిల్లలు..

    పెళ్లి.. పిల్లలు..

    బాలీవుడ్ అగ్ర నిర్మాతగా అప్పట్లో కొంత హడావుడి చేసిన బోణి కపూర్ తో ప్రేమలో పడిన శ్రీదేవి 1996లో వివాహం చేసుకుంది. ఇంట్లో వాళ్ళు వద్దు అన్నప్పటికి కూడా శ్రీదేవి ఎవరి మాట వినకుండా ముందే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న బోణి కపూర్ ని వివాహం చేసుకుంది. ఇక ఇద్దరు అడపిల్లలకి శ్రీదేవి జన్మనిచ్చింది. పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతుండగా త్వరలో ఎంట్రీ ఇవ్వాలని చిన్న కూతురు ఖుషి కపూర్ రెడీగా ఉంది.

    అనుమానాస్పద మరణం..

    అనుమానాస్పద మరణం..

    2018 ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా దేశమంతా షాక్ కి గురైన విషయం తెలిసిందే. ఎక్కడో దుబాయ్ లోని ఒక హోటల్ లో అనుమానాస్పదంగా శ్రీదేవి తుది శ్వాసను విడువడం సినీ లోకాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. మోహిత్ మార్వా పెళ్లి కోసమని వెళ్లిన శ్రీదేవి వెళ్లిన నాలుగు రోజలు సందడి చేసిన తరువాత బాత్ రూమ్ టబ్ లోనే పడి మరణించినట్లు పోస్టుమార్టం వచ్చింది. అయితే ఆమె మరణంపై ఇంకా అనుమానాలు ఏ మాత్రం తగ్గలేదు. సుశాంత్ సింగ్ మరణంపై చర్చలు జరుగుతున్న సమయంలో శ్రీదేవి మరణం వెనుక కూడా బలమైన కారణం ఎదో ఉండే ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.

    English summary
    No matter how many hardships came in life she never showed her hardships. Sridevi Also did many good deeds. And today the fans remember her on the occasion of the birthday of the heavenly beauty. They are also commenting that the suspicions on Sridevi's death have not abated.జీ
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X