twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ కూతురు గురించి ఆలా ఆలోచించొద్దు... అదరగొట్టిన చిరు చిన్నల్లుడు!

    |

    మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. కళ్యాణ్ దేవ్‌తో వివాహం తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా కొన్ని నెలల క్రితం పాప జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురికి నవిష్క అనే పేరు పెట్టుకున్నారు. నవిష్క జన్మించి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా కొన్ని ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు.

    కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా నవిష్క 6 నెలల లుక్ రివీల్ చేస్తూ ఫోటోస్ రిలీజ్ చేశారు. ఈ మెగా మనవరాలి క్యూట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ చిన్నారిని ఆశీర్వదిస్తూ లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆడ పిల్లలను కన్న తల్లిదండ్రులను ఉద్దేశించి కళ్యాణ్ దేవ్ చేసిన చేసిన కామెంట్స్ నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

    మీ కూతురు గురించి ఆలా ఆలోచించొద్దు

    మీ కూతురు గురించి ఆలా ఆలోచించొద్దు

    ‘‘మీ కూతుళ్లను సామర్థ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్దండి. అలా చేస్తే ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారనే బాధ మీకు ఉండదు. ఆమె పెళ్లి కోసం డబ్బు కూడబెట్టడం కంటే ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయండి. ఆమెను పెళ్లి కోసం సిద్ధం చేయడం కంటే ఆమె కోసం ఆమె ధైర్యంగా నిలబడేలా ప్రిపేయర్ చేయడం ఎంతో ముఖ్యం.'' అని కళ్యాణ్ దేవ్ తెలిపారు.

    కళ్యాణ్ దేవ్ పోస్టుపై ప్రశంసలు

    కళ్యాణ్ దేవ్ పోస్టుపై ప్రశంసలు

    కూతురు గురించి ఎంతో గొప్పగా వర్ణించడంతో పాటు, ఆడ పిల్లలను ఎలా పెంచాలి, వయసు పెరిగే క్రమంలో ఎదుర్కొనే సమస్యలపై వారిని ఎలా సిద్ధం చేయాలి, వారి విషయంలో తల్లిదండ్రుల ఆలోచనల్లో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది... అనేది కళ్యాణ్ దేవ్ చాలా బాగా వివరించారు అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

    కూతురు అంటే ఎంతో ప్రేమ

    కూతురు అంటే ఎంతో ప్రేమ

    తాను తండ్రి అవుతున్న విషయం తెలిసిన మరుక్షణం నుంచే కళ్యాణ్ దేవ్ హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయాడు. గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'శ్రీజ కళ్యాణ్ బేబీ 2 లోడింగ్' అంటూ అప్పట్లో అతడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే విషయాన్ని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే... నువ్వు పుట్టిన క్షణం నుంచే నీ ప్రేమలో పడ్డాను నవిష్క.'' కూతురుపై ప్రేమను వ్యక్తీకరించారు.

    కళ్యాణ్ దేవ్

    కళ్యాణ్ దేవ్

    శ్రీజను పెళ్లాడిన తర్వాత కొన్ని రోజులకే కళ్యాణ్ దేవ్ నటన వైపు అడుగులు వేశారు. మెగా ఫ్యామిలీ వారసత్వంతో ‘విజేత' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. తొలి సినిమాతో ఫర్వాలేదనిపించి ఈ మెగా ఫ్యామిలీ అల్లుడు సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

    English summary
    Srija Kalyan daughter Navishka turns 6 months. "Now I believe in love at first sight, because I’ve loved you from the moment you were born #Navishka." Kalyaan Dhev shared his daughter photos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X