HBDSSRajaMouli: పెళ్లై కొడుకున్న ఆమెతో లవ్‌లో పడిన జక్కన్న... అందుకే పిల్లలొద్దనుకున్నారా?
ఎస్ఎస్ రాజమౌళి... వరల్డ్ వైడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చులకన.. అలాంటిది బాలీవుడ్ ను మించి హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం రాజమౌళి అని చెప్పవచ్చు. ఇక అలాంటి రాజమౌళి ఓ పెళ్లై కొడుకు ఉన్న ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ పిల్లలను కనలేదు. అంత డబ్బు.. ఆస్తి, పేరు ఉన్నా... రాజమౌళి పిల్లలను ఎందుకు కనలేదో తెలుసా... ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ స్టోరీ తెలుసుకుందాం.
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం ఉంటుంది. తెలుగు వారినే కాదు.. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ తీసుకువచ్చి... తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేశాడు. ఇక ఆయన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1973లో కేవీ విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించాడు రాజమౌళి.

తండ్రి విజయేంద్ర ప్రసాద్.. రచయిత డైరెక్టర్. మరోవైపు సంగీత దర్శకుడు కీరవాణి పెదనాన్న కొడుకు. అంటే రాజమౌళికి అన్న అవుతాడు. ఇక రాజమౌళి చిన్నప్పుడు జులాయిగా తిరుగుతున్న సమయంలో వదిన శ్రీవల్లి చెప్పిన మాటలతో తను ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇక శాంతి నివాసం అనే సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న క్రమంలో రమతో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే పెళ్లై కొడుకు ఉన్న రమతో రాజమౌళి ప్రేమలో ఎలా పడ్డారో ఈ విషయం చాలా మందికి తెలియదు.

కీరవాణి, రాజమౌళి ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు అన్న విషయం తెలిసిందే. ఇక కీరవాణి భార్య శ్రీవల్లి. ఆమెకు రమ సోదరి. అలా రమ, రాజమౌళికి పరిచయం ఏర్పడింది. ఇక రాజమౌళి... రాఘవేంద్రరావు శిష్యుడిగా.. శాంతినివాసం సీరియల్ దరకత్వం వహించే అవకాశం రాగా.. ఆ సీరియల్ ను తెరకెక్కించే టైంలోనే రాజమౌళి రమతో సన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా డైరెక్ట్ చేసే టైంకి ప్రేమ కూడా చిగురించింది.
రమకు అప్పటికే వివాహం అయ్యి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా రాజమౌళి ఆమెను వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించారు జక్కన్న. మొత్తానికి ఇరు కుటుంబల సమక్షంలో పెళ్లి అయితే చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా కార్తికేయను తన సొంత కుమారుడు కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకుంటూ వచ్చాడు. ఒకవేళ తమకు సంతానం కలిగితే కార్తికేయను సరిగా చూసుకోమేమో అనే ఉద్దేశంతో రాజమౌళి రమతో సంతానాన్ని కూడా కోరుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు.

అయితే రాజమౌళి... ఓ ఆడపిల్లను కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఇక రాజమౌళి పనిచేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు కుటుంబం అంతా కలిసి పనిచేస్తుందని తెలిసిందే. రాజమౌళి సోదరుడు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తే ఆయన భార్య వల్లి ఆ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తారు. ఇక రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుండగా... కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఖర్చు పెరగకుండా తక్కువ ఖర్చులోనే క్వాలిటీ సినిమా ఎలా ఇవ్వాలనే బాధ్యతలు తీసుకుంటూ ఉంటాడు. అలా కుటుంబం మొత్తం సినిమా రంగంలో సెట్ అయిపోయారు.

ఇక రాజమౌళి సినిమా తీసే క్రమంలో అంతా ఒకే దగ్గర పనిచేయడంతో.. ఫ్యామిలీలో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుందని భావించవచ్చు. ఇక సెట్ లోకి వెళితే.. రాజమౌళి ఎలాగూ పని రాక్షసుడే. అలా రాజమౌళి రమతో ప్రేమలో పడి.. పిల్లలు కూడా కనలేదు. ఇక ఆయన గురించి తెలుసుకున్న నెటిజన్స్ ఇది కదా లవ్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ తో సినిమా చేసే పనిలో పడ్డారు. ఇక రాజమౌళి ఇలాంటి బర్త్డే లు మరెన్నో జరుపుకోవాలని.. ఎన్నో గొప్ప సినిమాలు తీసి పరిశ్రమకు అందించాలిని తెలుగు ఫిల్మీ బిట్ టీం కోరుకుంటూ.. ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











