twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు.. స్వీకరించిన రాంచరణ్ ఎన్టీఆర్.. రాజమౌళి డుమ్మా ఎందుకంటే?

    |

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, RRR సినిమాకు ప్రపంచ సినీ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. RRR చిత్రాన్ని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు వరించింది. తాను దర్శకత్వం వహించిన చిత్రానికి అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థ అవార్డును ఇవ్వడంపై రాజమౌళి ఆనందాన్ని వ్యక్తం చేశారు. RRR చిత్రానికి అమెరికాలోని ప్రముఖ సంస్థ అందించిన అవార్డు వివరాలు, రాజమౌళి రియాక్షన్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

    RRR సాటర్న్ అవార్డు

    RRR సాటర్న్ అవార్డు

    RRR చిత్రం దేశ సరిహద్దులు దాటి సినీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇప్పటికే ఆస్కార్ రేసులో పరుగులు పెడుతున్నది. ఈ సందర్భంగా సాటర్న్ అవార్డును RRR రావడం భారతీయ సినిమా ప్రేక్షకుల నుంచి సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. సినీ వర్గాల నుంచి అభినందనల వర్షం కురుస్తున్నది.

    SS Rajamouli కి రెండోసారి

    SS Rajamouli కి రెండోసారి

    సాటర్న్ అవార్డు విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా సైన్స్, ఫిక్షన్, ఫాంటసీ, హారర్, ఇతర జోనర్లలో ఉత్తమ విలువలతో రూపొందే సినిమాలకు అవార్డును ప్రదానం చేస్తారు. గతంలో కూడా ఈ అవార్డును రాజమౌళి అందుకొన్నారు. బాహుబలి2 సినిమాకు అందుకొన్నారు. మరోసారి ఈ అవార్డు రాజమౌళిని వరించడం విశేషంగా మారింది.

    పాపులర్ చిత్రాలతో RRR పోటీ

    పాపులర్ చిత్రాలతో RRR పోటీ

    అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లోని సాటర్న్ అవార్డ్ సంస్థ ప్రస్తుతం 50వ వార్షికోత్సవం జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రపంచ సినిమాలో సంచలనాలు సృష్టించిన సినిమాలను ఎంపిక చేసింది. ఈ అవార్డుకు డౌన్‌టన్ అబే: ఏ న్యూ ఎరా, ఈఫిల్, ఐయామ్ యువర్ మ్యాన్, రైడర్స్ ఆఫ్ జస్టిస్, సైలెంట్ నైట్ చిత్రాలు పోటిపడ్డాయి. అయితే చివరకు RRR మూవీని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.

    రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి

    రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి

    అయితే ముందస్తు కార్యక్రమాలు, అపాయింట్‌మెంట్ కారణాల వల్ల రాజమౌళి సాటర్న్ అవార్డును అందుకోలేకపోయారు. జపాన్‌లో RRR రిలీజ్, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా మారారు. అందుచేత ఈ అవార్డును అందుకోవడానికి వీలు చిక్కకపోవడంతో రాంచరణ్, ఎన్టీఆర్‌ను లాస్ ఎంజెలెస్‌కు పంపించారు. అ అవార్డును మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ ఇద్దరూ అందుకోనున్నారు.

     జపాన్‌లో RRR సినిమా రిలీజ్

    జపాన్‌లో RRR సినిమా రిలీజ్

    సాటర్న్ అవార్డు రావడంపై రాజమౌళి స్పందిస్తూ.. నా సినిమాలకు సాటర్న్ అవార్డు రావడం ఇది రెండోసారి. గతంలో బాహుబలి2 సినిమాకు వచ్చింది. ఈ సారి వ్యక్తిగతంగా ఈ అవార్డును అందుకోవాలని అనుకొన్నాను. జపాన్‌లో RRR సినిమా రిలీజ్ కారణంగా లాస్ ఎంజెలెస్‌కు వెళ్లలేకపోయాను. ఈ అవార్డును అందుకుబోయే ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

    ఆస్కార్ బరిలో RRR

    ఇదిలా ఉండగా, RRR చిత్రం మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్దంగా ఉంది. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ కోసం ఈ సినిమా పోటీ పడుతున్నది. పలు కేటగిరీలలో మాట్ రీవ్స్, రాబర్ట్ పాటిన్‌సన్ లాంటి దిగ్గజ దర్శకులతో పోటీ పడుతున్నారు. భారత్ తరపున ఆస్కార్‌కు అర్హత సాధించకపోయినా.. పలు కేటగిరీలో సొంతంగా నామినేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే.

    English summary
    Popular Director SS Rajamouli's RRR Movie honoured with prestigious Saturn Awards for the Best International Film. Ram Charan and Jr NTR starrer went on to bag the best international film award at the 50th Anniversary Saturn Awards held in Los Angeles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X