సీక్రెట్ లీక్: మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక రాజమౌళి ప్లాన్.. బాలయ్య కోసం అతడితో కలిశాడు.!

By Lekhaka

టాలీవుడ్‌లోని టాప్ డైరెక్టర్లలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'స్టూడెంట్ నెం 1' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. వందకు వంద శాతం సక్సెస్ రేటు ఉన్న జక్కన్న కొన్నేళ్లుగా భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అద్భుతమైన ప్లాన్ రెడీ చేశాడని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు మీకోసం.!

తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు

తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు


దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చూపిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకున్న ఆయన... స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అదే సమయంలో ‘బాహుబలి' అనే సినిమాతో తెలుగు సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేశాడు. అంతేకాదు, దీని వల్ల మన సినిమా స్టామినా ప్రపంచానికి తెలిసినట్లైంది.

హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. జక్కన్నకే సాధ్యమైంది

హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. జక్కన్నకే సాధ్యమైంది

‘బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం RRR (రౌద్రం రుధిరం రణం). టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఎంతో మంది సినీ ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సవాల్‌గా మారిన కరోనా.. సీఎంలతో చర్చలు

సవాల్‌గా మారిన కరోనా.. సీఎంలతో చర్చలు


RRR మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదిన్నర పైగానే అవుతోంది. దీంతో ముందుగా అనుకున్న డేట్‌ను కాదని, మరో తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. అప్పటికైనా సినిమాను తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్న సమయంలో కరోనా రూపంలో బ్రేక్ వచ్చింది. దీంతో షూటింగ్‌లకు అనుమతి కోసం రాజమౌళి ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యారు.

మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటన

మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటన

ప్రస్తుతం RRR షూటింగ్‌తో బిజీగా ఉన్న రాజమౌళి... ఈ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జతకట్టనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా 2021 చివర్లో ప్రారంభం అవుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

సీక్రెట్ లీక్: మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక రాజమౌళి ప్లాన్

సీక్రెట్ లీక్: మోక్షజ్ఞ ఎంట్రీ వెనుక రాజమౌళి ప్లాన్

వచ్చే ఏడాది వరకు RRR షూటింగ్.. ఆ తర్వాత కొద్ది రోజుల విరామం.. ఆ వెంటనే మహేశ్ బాబు ప్రాజెక్టు.. ఇలా దాదాపు మూడేళ్ల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు రాజమౌళి. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఆయన అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ న్యూస్ ఫిలింనగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

బాలయ్య కోసం అతడితో కలిసి అల్లేస్తున్నాడు

బాలయ్య కోసం అతడితో కలిసి అల్లేస్తున్నాడు

తాజా సమాచారం ప్రకారం.. రాజమౌళి అసిస్టెంట్లలో ఒకరు మోక్షజ్ఞ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా బాలయ్య, జక్కన్నకు వినిపించాడట సదరు దర్శకుడు. దీంతో గురువు కొన్ని మార్పులు చెప్పనట్లు తెలుస్తోంది. అదే సమయంలో కొంత భాగాన్ని ఆయనే రాసినట్లు ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Nandamuri Mokshagna Is Not Ready Yet, Latest Look Goes Viral
మోక్షజ్ఞను దగ్గరుండి తీసుకొచ్చేందుకు స్కెచ్

మోక్షజ్ఞను దగ్గరుండి తీసుకొచ్చేందుకు స్కెచ్

నందమూరి బాలకృష్ణ కుమారుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్నాడట రాజమౌళి అసిస్టెంట్. ఇదిలాఉండగా... ఈ సినిమా డైరెక్షన్ విషయంలో జక్కన్న పర్యవేక్షణ కూడా చేయనున్నారని ఇండస్ట్రీలోని కొందరు చెబుతుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X