twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ వదిలేసుకున్న బాక్సాఫీస్ హిట్స్.. ఆ సినిమాలు చేసి ఉంటే ఎలా ఉండేదో?

    |

    నేడు జూనియర్ ఎన్టీఆర్ 37వ బర్త్ డే కావడంతో అభిమానుల్లో ఒక సందడి నెలకొన్నట్లు సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్ధమవుతుంది. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తారక్ అభిమానుల సంఖ్య అమితంగా పెరిగిపోయింది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని బాక్సాఫీస్ హిట్టు కథలను అనుకోకుండా వధులుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఎన్టీఆర్ మిస్ చేసుకున్న బాక్సాఫీస్ సినిమాలపై ఒక లుక్కేస్తే..

    దిల్:

    దిల్:

    దర్శకుడు వివి.వినాయక్ ఎన్టీఆర్ తో చేసిన మొదటి సినిమా ఆది ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఆ తరువాత దిల్ సినిమా కూడా ఈ హీరోతోనే చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో తన రేంజ్ కి ఆ సినిమా సెట్టవ్వదని రిజెక్ట్ చేశాడట.

    ఆర్య:

    ఆర్య:

    సుకుమార్ మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఆది లాంటి మాస్ ఎంటర్టైనర్ తరువాత ఇలాంటి లవ్ స్టోరీ ఎంత మాత్రం సెట్టవ్వదని ఎన్టీఆర్ వదిలేసుకోగా ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది.

    అతనొక్కడే

    అతనొక్కడే

    దర్శకుడు సురేందర్ రెడ్డి మొదట ఈ కథను ఎన్టిఆర్ కి వినిపించగా ఈ కథ అన్న కళ్యాణ్ రామ్ కి బావుంటుందని సలహా ఇచ్చాడట. ఆ సినిమా హిట్టవ్వడంతో దర్శకుడికి అశోక్ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్.

    కృష్ణ

    కృష్ణ


    రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన కృష్ణ సినిమాను మొదట ఎన్టీఆర్ తో చేయాలని దర్శకుడు వివి.వినాయక్ చాలానే ప్రయత్నం చేశారు. కానీ ఈ కథ కూడా తన బాడీ లాగ్వేజ్ కి సెట్టవ్వదని తారక్ వదిలేసుకున్నాడు

     భద్ర

    భద్ర

    బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా భద్ర సినిమా చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లింది. ఇక చివరకి ఎన్టీఆర్ దగ్గరకు చేరుకోగా ఎందుకో రిస్క్ చేయకూడదని అనిపించి తారక్ ఆ కథను వేదిలేసుకున్నాడట.

    కిక్

    కిక్

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరో బాక్సాఫీస్ హిట్ కిక్ సినిమా కూడా మొదటి ఎన్టీఆర్ దగ్గరకే వచ్చింది. అటు నుంచి ప్రభాస్ వద్దకు వెళ్లింది. ఫైనల్ గా రవితేజతో తెరకెక్కిన కిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకుంది.

    శ్రీమంతుడు

    శ్రీమంతుడు

    మిర్చి హిట్టు తరువాత దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి శ్రీమంతుడు కథను వినిపించాడట. కానీ అప్పటికే కొంత బిజీగా ఉండడంతో ఈ సినిమా తరువాత తప్పకుండా మనం ఒక సినిమా చేద్దామని ఇచ్చిన మాట ప్రకారం జనతా గ్యారేజ్ సినిమా చేశాడు తారక్.

    ఊపిరి

    ఊపిరి

    ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా వదిలేసుకున్న మంచి చిత్రాల్లో ఊపిరి సినిమా ఒకటి. తెలుగు తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. మొదట్లో ఎన్టిఆర్ ఈ సినిమా చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపాడు. కానీ వేరే సినిమాల వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసుకోవాల్సి వచ్చింది.

    Recommended Video

    Thaman Vs Devi Sri Prasad : Musical Fight In Tollywood
    రాజా ది గ్రేట్..

    రాజా ది గ్రేట్..

    దర్శకుడు అనిల్ రావిపూడి కథ రాసుకోగానే ముందుగా ఎన్టీఆర్ ని సంప్రదించారట. కానీ అభిమానులు అలాంటి పాత్రలో చూసి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదని రిస్క్ చేయడం కుదరదని ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేశాడు. అనంతరం రామ్ నుంచి రవితేజ దగ్గరకు వెళ్లిన రాజా ది గ్రేట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

    English summary
    Today's Junior NTR's 37th Birthday is a buzz of fans and a look on social media makes it easy. The number of Tarak fans has soared since the first film. Otherwise, Junior NTR had to accidentally write a few box office hit stories in his career. If you take a look at the box office movies that NTR once missed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X