అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్.. అగ్ర దర్శకుల నుంచి స్పెషల్ సర్ ప్రైజ్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అభిమానులు పుష్ప సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న ఫస్ట్ లుక్ టీజర్ కోసం కూడా ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఏప్రిల్ 7న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6గంటలకు సోషల్ మీడియాలో బర్త్ డే CDP ని విడుదల చేయబోతున్నారు. ఈ రోజుల్లో ప్రతి హీరోకు సంబంధించిన బర్త్ డే కామన్ డిస్ ప్లే పిక్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అల్లు ఆర్మీ కూడా ట్రెండ్ లిస్ట్ లోకి తేవడానికి రెడీ అవుతోంది. ఇక CDPని ప్రముఖ దర్శకుల ద్వారా రిలీజ్ చేయించడం విశేషం.

కొరటాల శివ, హరీష్ శంకర్, సుకుమార్ తో పాటు మారుతి కూడా ట్విట్టర్ ద్వారా బర్త్ స్పెషల్ CDP ని రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక సుకుమార్ పుష్ప అనంతరం బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో కూడా ఐకాన్ అనే ఒక సినిమా చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











