CCL 2024 హోరాహోరీ పోరులో బెంగాల్ టైగర్స్ ఓటమి.. సుదీప్ కిచ్చ జట్టుకు ఎన్ని పరుగుల గెలుపు అంటే?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ రెండు జట్లు పోటాపోటీగా ప్రతీ ఇన్నింగ్స్‌లోను 100 పరుగులకుపైగా రన్స్ చేసి తమ ప్రతిభను చాటుకొన్నాయి. 138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగాల్ టైగర్స్ జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..

బెంగాల్ టైగర్స్ జట్టు వివరాలు
ప్రముఖ నటుడు జిసు సేన్‌గుప్తా కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగింది. ఈ జట్టులో బోన్ని, జామ్మీ, జాయ్, యూసఫ్, సౌరభ్ దాస్ (వికెట్ కీపర్), సత్‌దీప్, తరణ్ దీప్, ఆదిత్య, ఉదయ్, రాహుల్ సభ్యులుగా ఉన్నారు.

Sudeep Kichcha s Karnataka Bulldozers Won 30 Runs over Jisshu Senguptha s Bengal Tigers in Celebrity Cricket League 2024

కర్ణాటక బుల్డోజర్స్ జట్టు వివరాలు
సూపర్ స్టార్ సుదీప్ కిచ్చ నేతృత్వంలో కర్ణాటక జట్టు ప్రత్యర్థి బెంగాల్ జట్టును ఎదుర్కొన్నది. చందన్ (వికెట్ కీపర్), జయరాం కార్తీక్, కరణ్ ఆర్యన్, రాజీవ్, కృష్ణా, మంజునాథ్ గౌడ, ప్రతాప్, సునీల్ రావు, త్రివిక్రమ్ జట్టు సభ్యులుగా ఉన్నారు.

మొదట బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టు ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు రాజీవ్ 6 పరుగులు, కార్తీక్ 7 పరుగులు, నిరూప్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. దాంతో జట్టు ఆదుకోవడానికి కృష్ణ, కరణ్ రంగంలోకి దిగారు. కరణ్ 23 బంతుల్లో 49 పరుగులు చేసి అవుటయ్యారు. కృష్ణా 21 బంతుల్లో 54 పరుగులు చేశాడు. త్రివిక్రమ్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. బెంగాల్ జట్టులో జామ్మీ 2 వికెట్లు, ఉదయ్ 2 వికెట్లు, రాహుల్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ టైగర్స్‌లో జిషు సేన్ గుప్తా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకొన్నాడు. జిషు సేన్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక జామీ 26 బంతుల్లో 40 పరుగులు చేయడంతో జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. కర్ణాటక జట్టులో కార్తీక్ 1 వికెట్, కృష్ణా 1 వికెట్ పడగొట్టారు.

Sudeep Kichcha s Karnataka Bulldozers Won 30 Runs over Jisshu Senguptha s Bengal Tigers in Celebrity Cricket League 2024

ఇక కర్ణాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. జట్టులో కృష్ణ మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 21 బంతుల్లోనే 54 పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోర్ చేయడానికి ఉపయోగపడింది. అలాగే కరణ్ 23 బంతుల్లో 49 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక జట్టు 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. దాంతో బెంగాల్ టైగర్స్ జట్టు ముందు 139 పరుగులు లక్ష్యాన్ని పెట్టింది.

బెంగాల్ జట్టు భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్ ఉదయ్ పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. రాహుల్ 16 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ జిషు కూడా తక్కువ స్కోరుకే అంటే.. 11 పరుగులకే వెనుదిరిగాడు. దాంతో గెలుపు యూసఫ్, జాయ్ బాధ్యత పెరిగింది. కానీ కర్ణాటక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X