ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్

సుధీర్ బాబు ఇప్పుడు తన శరీరాకృతిని ఎంతలా మార్చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పటికే సుధీర్ బాబు వీ సినిమా కోసం ధృడంగా మారిపోయాడు. ఇప్పుడు అంతకు మించి అనేలా బాడీని పెంచేశాడు. సుధీర్ బాబు నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా కోసం ఇంతలా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. అయితే తాజాగా సుధీర్ బాబు ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో సుత్తితో తనను తాను బాదుకున్నాడు.

ప్రత్యేకంగా నిలిచాడు..

ప్రత్యేకంగా నిలిచాడు..

సుధీర్ బాబు ఘట్టమనేని ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పర్చుకున్నాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సుధీర్ తన క్యారెక్టరైజేషన్, కథ కథనాలు ఉండేలా చూసుకున్నాడు. అలా సుధీర్ బాబు సినిమాలంటే అందరిలోనూ ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే వరకు ఎదిగాడు.

కథకు ప్రాధాన్యమున్న చిత్రాలు..

కథకు ప్రాధాన్యమున్న చిత్రాలు..


సుధీర్ బాబు హీరోయిజం కంటే ఎక్కువగా కథను నమ్ముతాడు. కథకు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే సుధీర్ బాబు నటిస్తుంటాడు. తన హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు సుధీర్ బాబు ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు. మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా కూడా ప్రేమ కథా చిత్రమ్, సమ్మోహనం వంటి వాటిల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

అంచనాలు అందుకోలేక..

అంచనాలు అందుకోలేక..


ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వచ్చిన వీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కానీ సుధీర్ బాబు వేసిన క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. అలా సుధీర్ బాబుకు మాత్రం వీ కలిసి వచ్చింది. ఇప్పుడు సుధీర్ బాబు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మళ్లీ ఇంద్రగంటితో ఓ సినిమాను పట్టాలెక్కించాడు.

Recommended Video

Mahesh Babu కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాతని మర్చిపోయిన Namrata!
తాజాగా అలా..

తాజాగా అలా..

వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న సుధీర్ బాబు.. వర్కవుట్లు మాత్రం మానడం లేదు. టాలీవుడ్ హంక్‌లా మారిపోయాడు. గుర్తు పట్టలేనంతగా బాడీని పెంచేశాడు. తాజాగా సుధీర్ బాబు ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో తన బాడీని సుత్తితో కొట్టుకున్నాడు. అలా చేస్తే నొప్పులన్నీ తగ్గిపోతాయంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. చేతుల, భుజం, కాళ్లపై సుధీర్ బాబు సుత్తితో కొట్టుకోవడంపై నెటిజన్లు ఫన్నీ కామెంంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X