రష్మీ ఇంటికి సుడిగాలి సుధీర్: వచ్చింది శోభనం కోసం కాదంటూ గాలి తీసేశాడు.!

By Manoj

అద్భుతమైన గ్లామర్‌తో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్. యాక్టింగ్, డ్యాన్స్, మ్యాజిక్ ఇలా అన్ని రకాల విద్యలను ప్రదర్శిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు సుడిగాలి సుధీర్. వృత్తి పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ ఇద్దరూ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నవారే. వాస్తవానికి విడివిడిగా కంటే ఇద్దరూ కలిసే బాగా పాపులర్ అయ్యారు. అందుకే వీళ్లిద్దరిపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ ఇంట్లో సుధీర్ కనిపించి షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం.!

యూట్యూబ్ జోడీ... యమ పాపులర్

యూట్యూబ్ జోడీ... యమ పాపులర్


రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ను యూట్యూబ్ జోడీ అని పిలుస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఈ జంటపై యూట్యూబ్‌లో వచ్చినన్ని రూమర్లు మరెవరిపై రాకపోవడమే. వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. దీంతో ఈ జబర్దస్త్ జంట యమ పాపులర్ అయిపోయింది.

ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఆపడం లేదు

ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఆపడం లేదు

హీరోయిన్ కమ్ యాంకర్ రష్మీ గౌతమ్ - కమెడియన్ కమ్ హీరో సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్లు వీళ్ల గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ జంట తరచూ మీడియా దృష్టికి వస్తోంది. ఈ క్రమంలోనే ఆ వార్తలను ఖండిస్తూ ఇద్దరూ ప్రకటించినా అవి మాత్రం ఆగడం లేదు.

వాళ్ల క్రేజ్‌ను వాడుకుంటున్న మేకర్స్

వాళ్ల క్రేజ్‌ను వాడుకుంటున్న మేకర్స్

వీళ్లపై వచ్చే రూమర్లు రోజు రోజుకూ తగ్గకపోగా పెరిగిపోతున్నాయి. దీంతో వాళ్లు పని చేస్తున్న షోల దర్శకులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. రష్మీ - సుధీర్‌పై ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయడం.. ఇద్దరితో రొమాంటిక్ డైలాగ్స్ పలికించడం.. ఆపై ఈ జంటతో మాంచి ఫీల్ ఉన్న పాటలకు డ్యాన్స్ చేయించడం వంటివి చేసి టీఆర్పీలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సుధీర్ డైలాగులకు అందరిలో డైలమా

సుధీర్ డైలాగులకు అందరిలో డైలమా

ఒకవైపు తమ మధ్య ఏమీ లేదని చెబుతున్న రష్మీ సుధీర్... ఆన్‌ స్క్రీన్‌పై మాత్రం రొమాన్స్ పండిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ ఏదో రకంగా తమ మధ్య బలమైన బంధం ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇక, సుధీర్ సైతం పలు ఇంటర్వ్యూలు, స్కిట్లలో రష్మీపై ప్రేమ ఉన్నట్లు చెబుతున్నాడు. దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక డైలామాలో పడుతున్నారు ప్రేక్షకులు.

రష్మీ ఇంట్లో సుధీర్ పెళ్లి చూపులు

రష్మీ ఇంట్లో సుధీర్ పెళ్లి చూపులు

ఇప్పటికే విడివిడిగా... జంటగా ఎన్నో షోలలో పాల్గొన్నారు బుల్లితెర జోడీ రష్మీ - సుధీర్. ఈ క్రమంలోనే ఈ జంట తాజాగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘అలీతో సరదాగా'లో కమెడియన్ అలీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలు విషయాలు వెల్లడించారు. అలాగే, అలీ వీళ్లిద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show

వచ్చింది శోభనం కోసం కాదంటూ..


అలీ చెప్పిన దాని ప్రకారం... రష్మీ ఇంట్లో వెంకటలక్ష్మీ (ఈమె కూడా రష్మీనే) అనే అమ్మాయితో సుధీర్‌కు పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కొడుకును చూసేందుకు సదరు యువతి వస్తుంది. ఆ సమయంలో అలీ కలుగజేసుకుని ‘అమ్మా నువ్వు వచ్చింది శోభనానికి కాదు.. పెళ్లి చూపులకు. ఆ సౌండ్‌లు ఏంటి' అని పంచ్ వేశాడు. దీంతో సుధీర్ పగలబడి మరీ నవ్వాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X