హీరోయిన్లను తలదన్నేలా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. కళ్లు తిప్పుకోలేనంత అందంతో!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకే కాదు ఫ్యాన్ ఇండియా మూవీ లవర్స్ కూడా బాగా తెలుసు. ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీపైనే అందరి దృష్టి ఉంది. అయితే అంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆయన కూతురు తాజాగా గ్లామర్ షో చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంతకీ సుకుమార్ వారసురాలు సుకృతి ఎందుకు, ఎక్కడ గ్లామర్ ఒలకబోసింది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

డైరెక్టర్ సుకుమార్ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. కానీ సుకుమార్ ఫ్యామిలీ గురించి మూవీ లవర్స్ కి పెద్దగా తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన కూతురు సుకృతి గురించి. అడపా దడపా సుకృతి గురించి ఏదో ఒక వార్త రావడం తప్పితే ఆమె గురించి సినీ జనాలకు పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో సుకుమార్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

Sukriti ramp walk photos goes viral in a fashion show

ఆయన కూతురు సుకృతి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించి ఏకంగా దాదాసాహెబ్ అవార్డును అందుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టిని ఆకర్షించింది. సుకృతి ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో 8వ తరగతి చదువుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే షార్ట్ ఫిల్మ్ కే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకుంటే, ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెడితే రికార్డులు గల్లంతు కావడం ఖాయం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు సుకుమార్ అభిమానులు.

అయితే సుకృతి త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతుందని ఓ రూమర్ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే సుకృతి తాజా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె ఎప్పటిలా సాధారణంగా కాకుండా హీరోయిన్లను మించే రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తూ కనిపించింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది.

Sukriti ramp walk photos goes viral in a fashion show

మొదటినుంచి ఫ్యాషన్ రంగంపై ఇంట్రెస్ట్ ఉన్న సుకృతి తాజాగా ఫ్యాషన్ షోలో బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అందరిని నోరు వెళ్ళబెట్టేలా చేసింది. ఫస్ట్ టైం ఫ్యాషన్ మోడల్ గా ఒక ఫ్యాషన్ షోకు పని చేయడం తనకు గర్వంగా ఉందంటూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సుకృతి. ఆ ఫోటోలలో సుకృతి లుక్స్ చూసిన మూవీ లవర్స్ త్వరలోనే హీరోయిన్లకు గట్టి పోటీ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సుకుమార్ ప్రస్తుతం తనకు పాన్ ఇండియా డైరెక్టర్ బిరుదునిచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్ గా సెకండ్ పార్ట్ ను చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. భారీ అంచనాలున్న పుష్ప 2 మూవీని ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనుకున్నరు. కానీ పలు కారణాలతో వాయిదా పడగా, ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్టు రీసెంట్ గా చిత్ర బృందం అఫీషియల్ గా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X