లాక్‌డౌన్‌లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్చగా తిరుగుతున్నాడు.. సుకుమార్ ఎమోషనల్ పోస్ట్
డైరెక్టర్ సుకుమార్ టాలెంట్ ఏంటో తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లోని లాజిక్స్ చూస్తేనే ఆ సంగతి అర్థమవుతుంది. సుకుమార్ మాటలు, ఆయన తెరకెక్కించే విధానమూ రెండూ విభిన్నంగానే ఉంటాయి. తాజాగా ఆయన ప్రాణ మిత్రడు ప్రసాద్ మృతి చెందడంతో ఎంతగానో కుంగిపోయాడు. ప్రసాద్‌ను బావగాడు అంటూ సంబోధించే సుకుమార్.. నేడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. బావగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ చక్కటి కథను రాశాడు.

నిర్మాతగా కూడా
దర్శకుడు సుకుమార్‌కు వీఇవీకేడీఎస్ ప్రసాద్ అత్యంత సన్నిహితుడే కాకుండా నమ్మకమైన మనిషి. గత కొద్దికాలంగా సుకుమార్‌కు మేనేజర్‌గా ఆయన బాధ్యతలను చూసుకొంటున్నారు. ఇక అమరం అఖిలం, ప్రేమ అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ప్రసాద్ మరణంతో..
సుకుమార్ స్నేహితుడు, తన మేనేజర్, నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్ గత నెలలో గుండె పోటుతో మృతి చెందాడు. తన ప్రాణ మిత్రుడి మరణ వార్తతో సుకుమార్ కుంగిపోయాడు. లాక్ డౌన్ కారణంగా వెళ్లలేకపోయినందుకు సుకుమార్ బాధపడ్డాడు.

విషాదంలో సుకుమార్
ప్రసాద్ మృతితో సుకుమార్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు. తాను ఎప్పుడు నిరాశ, నిస్పృహలో ఉన్నా నా మిత్రుడు అండగా నిలిచేవాడని చెప్పుకొచ్చాడు. ప్రసాద్‌తో మాట్లాడితే ఎక్కడాలేని ఎనర్జీ వచ్చేదని తన జీవితంలో ప్రసాద్ కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. ఆయన మరణం తనకు తీరని లోటు అని సుకుమార్ ఆవేదన చెందాడు.

ఎమోషనల్ పోస్ట్..
నేడు తాను ఎంతో ప్రేమగా పిలుచుకుని బావగాడి(ప్రసాద్) పుట్టిన రోజు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడ. లేకపోవడం అంటే ఏంటీ అని కథను మొదలు పెట్టిన సుకుమార్.. మొదటి సారి ఈ పదం నాకర్థం కాకుండా పోయిందని అన్నాడు. ఆపై ఓ చక్కటి వర్ణనను కళ్ల ముందు కదులుతున్నట్టు గా స్క్రీన్ ప్లే రాశాడు. ప్రస్తుత పరిస్థితులు, లాక్ డౌన్‌ను ప్రస్థావిస్తూ ఆ కథలో ఎన్నో జోడించాడు. బావగాడంటే ఎంత ప్రేమో చాటిచెప్పేలా కథనాన్ని రాశాడు.

లేకపోవడం ఏంటి?
చివరకు కలలోంచి మెళుకువ వచ్చినట్టు.. ఈడెమ్మ ఈ మెళకువను చంపెయ్యాలి అంటూ ముగించాడు. లేకపోవడం అంటే మనం ఈ బతకు అనే లాక్‌డౌన్‌లో బంధీగా ఉండడమే అని ముగించాడు. లాక్‌డౌన్‌లో కూడా నా జ్ఞాపకాల్లో స్వేచ్చగా తిరుగుతున్న ‘బావగాడికి(ప్రసాద్)' జన్మదిన శుభాకాంక్షలను తెలిపాడు. ప్రస్తుతం ఈ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











