Just In
- 3 min ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 58 min ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
- 1 hr ago
ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్
- 2 hrs ago
మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏ వృత్తిలో ఉన్నా సరే మనం వారికే రుణపడతాం.. మైమరిచిపోతోన్న సుమ.. పిక్ వైరల్
యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు కేవలం బుల్లితెర, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చేసే సందడి మాత్రమే చూస్తూ వచ్చాం. కానీ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సుమ చేసే రచ్చ పీక్స్‌లో ఉంటోంది. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాను సుమ ఓ ఊపు ఊపేసింది. వెరైటీ వీడియోలతో నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది.

వెరైటీ వీడియోలు..
లాక్డౌన్ సమయంలో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన పెట్ జోరోతో కలిసి రచ్చ రచ్చ చేసింది. వంటలు వండుతూ బోళ్లు కడుతూ డ్యాన్సులు చేస్తూ హంగామా సృష్టించింది. ఇవే కాకుండా కరోనాపై అవగాహన కలిగించేందుకు కూడా కొన్ని వీడియోలను చేసింది.

మాస్క్ ధరించాలంటూ..
మాస్క్ ధరించాలంటూ సుమ ఫన్నీగా కొన్ని వీడియోలను చేసింది. సుమ చెప్పిన కామెడీగానే ఉన్నా కానీ ఎంతో మంచి సందేశాలను ఇస్తూ వచ్చింది. బయటకు వెళ్లినప్పుడు, పని చేస్తున్న ప్రదేశాల్లోనూ మాస్క్‌లు ధరించాలంటూ అందరినీ వేడుకుంది.

కొత్త షోతో హంగామా..
సుమ తాజాగా ఓ కొత్త షోను ప్రారంభించేసింది. బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్ అంటూ యాంకర్ రవితో పాటు ఈ కొత్త షోను నడిపించేందుకు సుమ సిద్దమైంది. ఈపాటికే ప్రోమోలతో రచ్చ రచ్చ చేశారు. మొదటి ఎపిసోడ్‌లో కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌లు సందడి చేయబోతోన్నారు.

గౌరవం ఇవ్వాలి..
తాజాగా సుమ ఓ పోస్ట్ చేసింది. రైతుల దినోత్సవం సందర్భంగా సుమ.. మనం కంచెంలో రోజూ అన్నం వస్తుందంటే.. మన రైతులు రోజూ కష్టపడుతున్నారన్న మాట. మనకు అన్నం పెట్టేందుకు వారు కష్టపడుతున్నారు.. మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా.. రైతుల కష్టానికి, వారి అంతులేని శ్రమకు, అంకితభావానికి మనం గౌరవం ఇవ్వాల్సిందే.. అంటూ చెప్పుకొచ్చింది

మైమరిచిపోతోంది..
మన దేశానికి రైతు వెన్నుమొకలాంటి వాడు.. మనం సమాజంలో వారికి అత్యున్నత స్థానాన్ని కల్పించాలి..ఈ రైతుల దినోత్సవం సందర్భగా.. మన రైతులందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను.. అంటూ సేద్యం చేస్తోన్న ఫోటోను, కాసిన కాయను పట్టుకుని మైమరిచిపోతోన్న ఫోటోలను సుమ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.