కాకరకాయ కథ ఎంత బాగా చెబుతుందో .. సుమ తెలివితేటలు మామూలుగా లేవు కదా!!

యాంకర్ సుమ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. విడమరిచి చెప్పనక్కర్లేదు. స్టేజీ ఎక్కితే మాటల ప్రవాహాంలో ఎవ్వరైనా సరే కొట్టుకుపోవాల్సిందే. ఆమె వేసే సెటైర్లకు, కామెడీ టైమింగ్‌కు, పంచ్‌లకు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతోన్న సుమ.. ఈ మధ్య సోషల్ మీడియానూ ఏలేస్తోంది. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్‌లో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

సుమ సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. లాక్డౌన్‌లో సుమ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. డ్యాన్సులు, పాటలు, వంటల కార్యక్రమాలు, పూజలు ఇలా ఎన్నెన్నో చేసి, వాటిని చూపించి అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆమె వేసిన స్టెప్పులకు పెంపుడు కుక్క సైతం బెదిరిపోయింది.

యూట్యూబ్‌లో అలా..

యూట్యూబ్‌లో అలా..

ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ యూట్యూబ్‌ సంపాదనపై పడ్డారు. ప్రతీ ఒక్కరూ సొంతంగా ఓ యూట్యూబ్ చానె‌ల్‌ను రన్ చేస్తున్నారు. సుమ సైతం సుమక్క పేరుతో చానెల్‌ను ప్రారంభించింది. లాక్‌డౌన్‌లో ఆన్ లైన్ ఇంటర్వ్యూలు, కామెడీ షోలు చేసి అందర్నీ నవ్వించింది.

ఫ్యామిలీతోనూ అంతే..

ఫ్యామిలీతోనూ అంతే..


సుమ తన ఫ్యామిలీతోనూ అంతే సరదాగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కేవలం తన ఫ్యామిలీనే కాకుండా రాజీవ్ కనకాల సోదరి నటి స్వర్గీయ శ్రీలక్షీ కనకాల ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటుంది. తాజాగా శ్రీలక్ష్మీ కూతురిని ఆట పట్టించే ప్రయత్నం చేసింది. అందుకోసం కాకరకాయ కథను బాగానే చెప్పింది.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!

కాకరకాయ కూరతో...

సుమ కాకరకాయ కూరను చేసినట్టుంది. మాములుగా పిల్లలకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు. అది చేదుగా ఉంటుందని ముట్టరు. ఇక ఇక్కడ కూడా అంతే ఉంది వ్యవహారం. ఆ అమ్మాయి ఈ కాకరకాయను తినను అంటే.. ఇది ఈ కాకరకాయ కాదు ఆ కాకరకాయ అంటూ పదే పదే ఆ పాపను సుమ సతాయించింది. ఇక ఎంతకీ తినకపోవడంతో తన ఫాలోవర్స్‌ను కోరింది. మీరు తింటారా? ఈ కాకరకాయను అని అడగంతో ఎగబడి మరీ కామెంట్లు చేశారు. మొత్తానికి సుమ చేసిన ఈ కాకర కాయ కూర, చెప్పిన కథ బాగానే వర్కౌట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X