రెండు కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సుమ... ఎవరికీ సాధ్యం కాని రికార్డ్‌ను మిస్సైందిగా.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని చాలా ఏళ్లుగా టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది సుమ కనకాల. అద్భుతమైన హావభావాలు, టైమింగ్ పంచెస్‌తో మెప్పిస్తూ ఎంతో మంది అభిమానాన్ని అందుకుంది. తెలుగు మాతృభాష కాకపోయినా.. అనర్గళంగా మాట్లాడడుతూ ఔరా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నో టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు, ఫ్యామిలీ యాడ్స్ చేస్తూ సత్తా చాటుతోంది. యాంకరింగ్ అంటే సుమ.. సుమ అంటే యాంకరింగ్ అనేలా ప్రభావం చూపిస్తున్న ఈమె... ఇటీవల ఓ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందని తాజాగా ఓ న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

వాళ్లంతా గ్లామర్‌గా.. సుమ మాత్రం

వాళ్లంతా గ్లామర్‌గా.. సుమ మాత్రం

ప్రస్తుతం తెలుగులో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది గ్లామర్ డాల్స్‌గా పేరు తెచ్చుకున్నవారే. అందంగా కనిపిస్తూనే యాంకరింగ్‌లో మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలు అందుకుంటున్నారు. కానీ, సుమ మాత్రం వీరికి భిన్నంగా ఉంటుంది. అద్భుతమైన టాలెంట్‌తోనే ఆమె ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతోంది.

ఎక్కడ చూసినా సుమే కనిపిస్తుంది

ఎక్కడ చూసినా సుమే కనిపిస్తుంది

తెలుగులో ఎంతో మంది యాంకర్లు ఉన్నా... అందరి మొదటి ఛాయిస్ సుమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలతో పాటు సినిమా ఫంక్షన్లకు ఆమె డేట్స్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఇంతలా ప్రభావం చూపిస్తోందీ సీనియర్ యాంకర్. ఇక, ఈ మధ్య వ్యాపార ప్రకటనల్లో సైతం నటిస్తోంది. దీంతో సుమ కెరీర్ బిజీ బిజీగా సాగిపోతోంది.

ఫేమ్ ఉన్నా సినిమాలకు దూరంగా

ఫేమ్ ఉన్నా సినిమాలకు దూరంగా

కావాల్సినంత పేరు ప్రఖ్యాతలు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సుమ మాత్రం సినిమాల్లో నటించడానికి ముందుకు రావడం లేదు. దీనికి కారణం ఆమె వరుస టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతుండడమే. గతంలో ఆమె చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే ‘విన్నర్' మూవీలో ఓ పాటను కూడా పాడింది.

బిగ్ బాస్ ఆఫర్ వద్దనుకున్న సుమ

బిగ్ బాస్ ఆఫర్ వద్దనుకున్న సుమ

తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న షోలలో బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్' ఒకటి. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో దానిని కూడా ప్రారంభించబోతుంది. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొనేందుకు సుమను స్టార్ మా సంప్రదించిందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే టాక్ వినిపిస్తోంది.

ఎవరికీ ఇవ్వనంత మొత్తం ఇస్తామన్నా

ఎవరికీ ఇవ్వనంత మొత్తం ఇస్తామన్నా

తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ కావడంతో సుమను గత రెండు సీజన్ల నుంచి కంటెస్టెంట్‌గా రావాలని స్టార్ మా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఆమె ప్రతిసారీ వాళ్ల ఆఫర్‌ను తిరస్కరించిందన్న వార్తలూ వచ్చాయి. ఇక, నాలుగో సీజన్ కోసం ఆమెకు ఎపిసోడ్‌కు రూ. 2 - 2.5 లక్షలు ఇస్తామని నిర్వహకులు ఆఫర్ చేసినట్లు తాజా సమాచారం.

చరిత్ర సృష్టించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్

చరిత్ర సృష్టించే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్

వాస్తవానికి తెలుగులో వచ్చిన మూడు సీజన్లలోనూ ఎపిసోడ్‌కు రూ. లక్షకు మించి ఎవరికీ ఛార్జ్ చేయలేదు స్టార్ మా. మూడో సీజన్‌లో శ్రీముఖి మాత్రమే అంత మొత్తం అందుకుందన్న టాక్ వినిపించింది. ఇప్పుడు సుమకు మాత్రం ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. కానీ, ఆమె రిజెక్ట్ చేయడమే అందరినీ ఆలోచింపజేస్తోంది.

రూ. రెండు కోట్లను వద్దనుకున్నట్లే

రూ. రెండు కోట్లను వద్దనుకున్నట్లే

సుమకు ప్రస్తుతం ఉన్న పాపులారిటీ ప్రకారం.. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే కచ్చితంగా ఫైనల్స్ వరకు ఉంటుంది. అంటే ఎపిసోడ్‌కు రూ. 2 లక్షల చొప్పున చివరి వరకు ఉంటే రూ. రెండు కోట్లు వస్తాయన్న మాట. ఇంత పెద్ద మొత్తాన్ని ఆమె వదులుకుందన్న వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X