Suma Kanakala: సుమ నోటి దురుసు.. లైవ్‌లోనే ఇచ్చిపడేసిన రిపోర్టర్!

యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె ఏ షోలో అయినా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. జోక్స్ వేస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటుంది. బుల్లితెర అయినా.. లైవ్ కవరేజ్ అయినా.. ఏదైనా తగ్గేదేలే అంటూ స్పాంటనియస్ గా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే ఈ రోజు ఆమె వేసిన జోక్స్ వివాదానికి దారి తీశాయి. ఇక మీడియాపై నోటి దురుసు చూపించిన సుమ.. లైవ్ లోనే ఓ రిపోర్టర్ ఆమెకు ఇచ్చి పడేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

బుల్లితెరపై తనదైన శైలిలో యాంకరింగ్ చేసుకుంటూ పోతూ.. సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నది ఎవరు అనగానే సుమ అని ఇట్టే చెప్పేస్తాం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా... స్మాల్ హిరో అయినా.. సుమ యాంకరింగ్ పక్కా ఉండాల్సిందే. అటు షోలు.. ఇటు బుల్లితెరపై ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతున్న సుమ ఓ వివాదానికి దారి తీసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Suma Kanakala satires on the media And Reporter Counter on Her Comments Video Goes Viral

అసలు ఏం జరిగిందంటే... వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే యాంకర్ సుమ... ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారిందని తెలుస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా ఆది కేశవ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

తాజాగా ఆది కేశవ సినిమా పాటను పార్క్ హయత్ లో లాంచ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి సుమ యాంకరింగ్ చేసింది. ఈ క్రమంలోనే సుమ... మీడియా మీద జోరు జారింది. ఏదో జోక్స్ వేసి నవ్విద్దామని అనుకున్నా ఆమె... చివరకు అదే వివాదం అయింది. అసలు విషయం ఏమిటంటే... సుమ ప్రోగ్రాం ప్రారంభించేందుకు కెమెరామెన్ల కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో ఒక్క కెమెరామెన్ అందుబాటులో లేకపోవడంతో... ఆమె మీడియాపై నోరు పారేసుకుంది.

మేము పెట్టిన స్నాక్స్ భోజనాల లాగా తింటున్న వారందరూ వచ్చి ప్రోగ్రాం లైవ్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంటూ సుమ మీడియాపై నోటి దురుసుతో ప్రవర్తించింది. సుమ చేసిన కామెంట్స్ అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు కోపం తెప్పించింది. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ యాంకర్ సుమకు లైవ్ లోనే ఇచ్చిపడేశారు. వైష్ణవ్ తేజ్ తో మాట్లాడే ముందు... మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం అనగానే యాంకర్ సుమ తనకు ఆ విషయంలో పేమెంట్ ఇవ్వలేదని మళ్లీ జోక్ వేసింది.

వెంటనే మీడియా ప్రతినిధి ఒక కల్పించుకుని మీరు ఇలా మీడియా మీద జోకులు వేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు. అయితే కేవలం తాను జోక్ గా మాత్రమే అన్నానని... తనకి ఎలాంటి దురుద్దేశం లేదని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. అయితే మేము చాలా బాధపడ్డాము... మీడియాపై జోక్స్ వద్దు అంటూ రిపోర్టర్ చెప్పుకువచ్చారు. దీంతో ఆమె సరే మీరు స్నాక్స్ భోజనాలు లాగా తినడం లేదు స్నాక్స్ లాగానే తింటున్నారు అంటూ చెప్పుకోచ్చింది. ఇదిగో ఇలాంటివే వద్దనేది దయచేసి ఇకముందు ఇలాంటివి చేయకండి అంటూ మీడియా ప్రతినిధి చెప్పుకువచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X