twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి3 కోసం రెడీగా ఉండు... బాహుబలిగానా? భళ్లాలదేవగా నటిస్తావా.. కట్టప్పగా ఎవరంటే

    |

    దేశవ్యాప్తంగా ఐపీఎల్ జోరు మొదలైంది. ప్రతీ క్రికెట్ అభిమానికి క్రికెట్ ఫీవర్ పట్టుకొన్నది. సన్ రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్) విజయం కోసం తెలుగు క్రికెట్ అభిమానులు కోరుకొంటున్నారు. ఎస్ఆర్‌హెచ్ టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్స్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగు వారికి ఫేవరేట్ క్రికెటర్లుగా మారిపోయారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్లు తాజాగా నాలుగు గంటలపాటు ప్రమోషనల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన చిట్‌చాట్ ఆసక్తికరంగా మారింది. అసలేం మాట్లాడారంటే..

    ప్రమోషనల్ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్

    ప్రమోషనల్ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్

    ప్రమోషనల్ షూటింగ్ ఎలా జరిగిందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. షూట్ చాలా బాగా జరిగింది. నాన్‌స్టాప్‌గా నాలుగు గంటలపాటు షూటింగ్ చేశాం. చివరి నిమిషం వరకు షూటింగ్‌ను ఎంజాయ్ చేశాను. షూటింగ్ చాలా సరదాగా గడిచిపోయింది అని కేన్ విలియమ్స్ అన్నారు.

    డేవిడ్ వార్నర్ ఆశ్చర్యంగా సమాధానం

    డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. ప్రమోషనల్ షూటింగ్ ఫెంటాస్టిక్. వెరీ వెరీ గుడ్. చాలా సహనంతో షూట్ చేశాం. గొప్ప నటీనటులు, సాంకేతిక వర్గంతో పనిచేశాం. చాలా సంతృప్తికరంగా షూటింగ్ సాగింది అని అన్నారు. ఈ షూటింగ్‌తో మీకు నటనపట్ల ఆసక్తి పెరిగిందా అనే ప్రశ్నకు కేన్ విలియమ్స్ నో అని చెప్పగా.. డేవిడ్ వార్నర్ బాహుబలిలో నటించాలని ఉంది అని అన్నారు.

    డేవిడ్ వార్నర్ ట్వీట్‌కు బాహుబలి టీమ్ రెస్పాన్స్

    డేవిడ్ వార్నర్ ట్వీట్‌కు బాహుబలి టీమ్ రెస్పాన్స్

    డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన బాహుబలి టీమ్.. వార్నర్ మాటలకు బదులిచ్చారు. నీ వీడియోలో మాటలు విన్నాం. నీవు బాహుబలి వైపా? లేదా భళ్లాలదేవ వైపా నిర్ణయించుకో.. అలాగే బాహుబలి3 సినిమా షూటింగ్ సిద్ధంగా ఉండు అని బాహుబలి టీమ్ ట్వీట్ చేసింది.

     వైరల్‌గా బాహుబలి 3 పోస్టర్

    వైరల్‌గా బాహుబలి 3 పోస్టర్

    అలాగే ఐపీఎల్‌‌లో ఎస్ఆర్‌హెచ్ ట్రోఫిని గెలువాలని కోరుకొంటున్నాం. మీకు మా హార్థిక శుభాభినందనలు. గ్రౌండ్‌లో మీ ప్రతాపం చూపి దంచి కొట్టండి అని బాహుబలి టీమ్ కోరింది. బాహుబలి టీమ్ చేసిన బాహుబలి3 ట్వీట్‌కు సన్ రైజర్ హైదరాబాద్ స్పందిస్తూ.. బాహుబలి3 పోస్టర్ ఇలా ఉంటే ఓకేనా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

     కట్టప్ప పాత్రలో ఎవరంటే

    కట్టప్ప పాత్రలో ఎవరంటే

    బాహుబలి, సన్ రైజర్ పోస్టులపై క్రికెట్ లవర్స్ అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఒకవేళ డేవిడ్ వార్నర్ బాహుబలి అయితే కట్టప్ప ఎవరని ఓ నెటిజన్ ప్రశ్న వేయగా మనీష్ పాండే అంటూ మరో నెటిజన్ తుంటరిగా జవాబిచ్చాడు. ఇలా ట్విట్టర్‌లో జరుగుతున్న చర్చలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

    రూ.1000 కోట్ల కలెక్షన్ల వసూళ్లు

    రూ.1000 కోట్ల కలెక్షన్ల వసూళ్లు

    ఇక బాహుబలి2 సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం ప్రపంచ సినిమాలోనే అద్భుతమైన విజయం సాధించింది. రాజమౌళి రూపొందించిన బాహుబలి1 రూ.650 కోట్లు, బాహుబలి2 చిత్రం 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే బాహుబలి సిరీస్ ఇక ఉండబోదు అనే విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు.

    English summary
    SRH crickter, Australian player David Warner show interest to play Baahubali. Then Baahubali team reacted to Warner and asked to prepare for Baahubali3. Are ready for Baahubali or Bhallaladeva, They asked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X