ఆ రోజు ఉదయ్ కిరణ్‌ని అలా చూసి షాకయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. సునీల్ ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్ తారాజువ్వ ఉదయ్ కిరణ్‌. కెరీర్ ప్రారంభించిన అనతికాలంలోనే ఉవ్వెత్తున ఎగిసిన ఈ యువ కిరణం.. ఊహించని రీతిలో నేలకొరిగింది. ఉదయ్ కిరణ్ ఈ లొక్కన్ని విడిచిన నాటి నుంచి నేటి వరకూ ఓ ఒక్కరూ అతన్ని మరువలేదు. ఏదో ఒక సందర్భంలో ఆ మ్యాటర్ బయటకొస్తూనే ఉంది. ఇటీవలే నటుడు సునీల్.. ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. వివరాల్లోకిపోతే..

Recommended Video

Actor Sunil Emotional Comments On Uday Kiran || Filmibeat Telugu
ఉదయ్ కిరణ్‌ క్రేజ్.. మరవగలమా!!

ఉదయ్ కిరణ్‌ క్రేజ్.. మరవగలమా!!

తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోలేరు హీరో ఉదయ్ కిరణ్‌ని. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ అలరిస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నారు ఉదయ్ కిరణ్. కెరీర్ ప్రారంభించిన అనతికాలంలోనే వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులో నంది అవార్డు కూడా అందుకున్నారు.

కెరీర్ పీక్ స్టేజ్‌.. అనుకోని కష్టాలు

కెరీర్ పీక్ స్టేజ్‌.. అనుకోని కష్టాలు

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అనుకోని విధంగా ఆయనను కష్టాలు వెంటాడాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర లేపిన ఆయన కెరీర్ ఒక్కసారిగా కుదేలయింది. కారణమేదైనప్పటికీ అద్భుతమైన కెరియర్ కళ్ళముందు కనిపిస్తుండగా ఒకే ఒక్క సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది.

వరుస హిట్స్.. టాలీవుడ్‌లో చర్చలు

వరుస హిట్స్.. టాలీవుడ్‌లో చర్చలు

చిత్రం, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే లాంటి వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ వచ్చిన ఉదయ్ కిరణ్.. 2004 తర్వాత పూర్తిగా పడిపోయాడు. వచ్చిన చాన్సులు నిలబడక, కొత్త అవకాశాలు రాక ఉదయ్ కిరణ్ కెరీర్ ముగిసే స్థితికి చేరింది. ఆ టైమ్‌లో ఈ ఇష్యూపై టాలీవుడ్‌లో పెద్ద చర్చలే నడిచాయి.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య..

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య..

అనంతరం కొన్నేళ్ల తర్వాత ఊహించని రీతిలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సొంతింట్లోనే ఉరేసుకొని చనిపోయారు. దీంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. ఆయన మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ పరిశ్రమ నిర్ఘాంత పోయింది.

ఉదయ్ కిరణ్‌తో సునీల్ ప్రయాణం

ఉదయ్ కిరణ్‌తో సునీల్ ప్రయాణం


ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయనతో తెర పంచుకున్న ఎందరో నటీనటులు స్పందిస్తూ పలు విషయాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే సునీల్ కూడా ఉదయ్ కిరణ్ గురించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్‌తో కలిసి నువ్వ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించిన సునీల్.. సెట్‌లో ఉదయ్ కిరణ్ ఎలా కష్టపడేవారో గుర్తుచేసుకున్నాడు.

 అలవాటయిందని అనేవాడు.. జీర్ణించుకోలేకపోయా

అలవాటయిందని అనేవాడు.. జీర్ణించుకోలేకపోయా

'నువ్వు నేను' షూటింగ్ సమయంలో.. ఓ రన్నింగ్ రేస్ నిజమైన రన్నర్‌లను డైరెక్టర్ తేజ తీసుకొచ్చారని, అయితే వాళ్లతో కలిసి ఉదయ్ కిరణ్‌ను పరిగెత్తాలని కోరగా.. వాళ్లతో నిజంగానే పరిగెత్తి ఉదయ్ కిరణ్ గెలిచారని చెప్పాడు సునీల్. అంత స్పీడ్‌గా ఎలా పరిగెత్తావని ఉదయ్‌ని అడిగితే చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్తి అలవాటయిందని చెప్పాడని సునీల్ అన్నాడు. అంత సరదాగా ఉండే మనిషి ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోయానని సునీల్ అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X