Sunita Williams: 286 రోజులు.. 4577 సార్లు కక్ష్యలో.. భేష్ సునీత విలియమ్స్.. చిరంజీవి, తారల ప్రశంసలు ట్వీట్స్
వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి తిరిగి రావడంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత, విల్మోర్ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో వారు ప్రయాణిస్తున్న వ్యోమ నౌక క్షేమంగా దిగడంతో అందరూ ఊపిరి పిల్చుకొన్నారు.
8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం గతేడాది జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్మోర్ సాంకేతిక కారణాల వల్ల అక్కడే ఉండిపోయారు. వారు ప్రయాణించాల్సిన వ్యోమనౌక వారు లేకుండా భూమికి తిరిగి వచ్చింది. తాజాగా మరో వ్యోమ నౌక డ్రాగన్ ఫ్రీడమ్ ద్వారా భూమికి సురక్షితంగా చేరుకొన్నారు. వారి రాక సుఖాంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. చిరంజీవితోపాటు ఎవరెవరు ఏమన్నారంటే?

భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్‌కు వెల్‌కమ్. హీరోయిజాన్ని ప్రదర్శించి ఇంటికి తిరిగి వచ్చిన సంఘటనను చారిత్రాత్మకంగా మలిచారు. 8 రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్లి.. 286 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. సుమారుగా 4577 సార్లు భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో తిరిగారు. అత్యంత డ్రామా ఉన్న మీ కథ దేనీకి సరితూగదు. నరాలు తెగే ఉత్కంఠలో నెయిల్ బైటింగ్ ఫినిషింగ్‌లా అనిపించింది. భూమ్మీద అరుదైన అడ్వెంచర్ ఇది. నిజంగా ఇది బ్లూ బ్లాక్‌బస్టర్. సునీతకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలి. వారిని క్షేమంగా తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్, క్రూ9కు అభినందనలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటి, మిస్ ఇండియా మనుషీ చిల్లర్ ట్వీట్ చేస్తూ.. సునీత విలియమ్స్ భూమ్మీదకు తిరిగి వచ్చిన సంఘటన మానవత్వాన్ని గుర్తు చేసింది. కష్టకాలంలో, ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో మనం సాగించే ప్రయోగాలు, పరిశోధన వెనుక ఎంత కృషి, సామర్థ్యం ఉందో తెలియచేస్తుంది. సునీతా విలియమ్స్ ధైర్య సాహసాలు చూస్తే గర్వంగా ఉంది. వెల్‌కమ్ బ్యాక్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
అంతరిక్షంలో 9 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించి భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన
@NASA ప్రముఖ వ్యోమగామి @Astro_Suni గారికి మనఃపూర్వక అభినందనలు. మీ ప్రస్థానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.మీ భద్రమైన రాకకు హర్షం వ్యక్తం చేస్తున్నాం! అని రోజా ట్వీట్ చేశారు.
అంతరిక్షంలో 9 నెలలపాటు జీవన ప్రయాణం. ఆ ప్రతికూల పరిస్థితుల్లో చూపిన సహనం, ఎనలేని పట్టుదల, ఎదురులేని ఆవిష్కరణలకు ప్రతిరూపం సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర తెలియచెప్పింది అంటూ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ట్వీట్‌లో ప్రశంసించారు.


Click it and Unblock the Notifications











