twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయన కోసం ప్రతి నిమిషం ప్రార్థిస్తున్నాం.. ఎస్పీబీపై సునీత ఎమోషనల్

    |

    గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం పరిస్థితిపై దేశమంతా ఆందోళన చెందుతోంది. బాలుకు కరోనా సోకడం, ఐసీయూ నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించడం అందరికీ తెలిసిందే. ఎస్పీబీ ఆరోగ్యం కుదుటపడాలని సంగీత ప్రియులు, సెలెబ్రిటీలు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలు తర్వగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేశారు. నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు అందరూ ప్రార్థనలు చేశారు.

    సామూహిక ప్రార్థనలపై ఎస్పీ చరణ్ స్పందిస్తూ.. కన్నీరు పెట్టుకున్నాడు. బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంగా స్థిమితంగానే ఉంది. మీ అందరి ప్రార్థనలతో ఆయన కోలుకుంటున్నారు. సినీ సంగీత ప్రపంచాలు ఆయన కోసం ప్రార్థిస్తున్న తీరు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ప్రేమ మాకు దక్కడం మా అదృష్టం అంటూ ఎస్పీ చరణ్ కన్నీరుమున్నీరయ్యాడు.

    Sunitha Emotional Over Mass Prayer For SPB

    మరోవైపు సునీత స్పందిస్తూ.. 'ఆయన స్వరం ఒక శ్లోకం .. ఆయన పాట ప్రార్థన .. ఆయన మనకు దేవుడు. మనము అతని గొంతును వినాలి. మనమందరి కోసం ఆయన తిరిగా రావాలి.. మునుపటి ధ్వని, ఆరోగ్యకరమైన ఎప్పటిలాగే ఆనందంగా ఉండటం అవసరం. మేమంతా ఆయన కోసం ప్రతి నిమిషం ప్రార్థిస్తున్నాం.

    ప్రకాశవంతమైన చిరునవ్వుతో ఆయనను మన మధ్య తిరిగి తీసుకురావడానికి ప్రపంచంలోని ప్రతి మూలలోనుండి మనమందరం ఈ రోజు సాయంత్రం 6 నుండి 6:05 గంటల మధ్య ఆయనకు సానుకూల శక్తిగా పంపించాము. సంగీత పరిశ్రమకు మాత్రమే కాదు, ఆ మనోహరమైన స్వరాన్ని వినగల ప్రతి వ్యక్తి జీవితానికి ఆయన మనకు దేవుడు !! బాలు గారు, మీరు తిరిగి కావాలి .. అతి త్వరలో. దయచేసి తిరిగి రండి' అని కోరింది.

    English summary
    Sp Charan Emotional Over Mass Prayer For SPB, Sunitha Emotional Over Mass Prayer For SPB. His voice is a hymn.. his song is a prayer .. He is the God to us. we need to hear him. We all need him back, sound and healthy and joyful as ever.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X