ఇకపై నీకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.. దత్త పుత్రికపై సన్నీ లియోన్ ఎమోషనల్ పోస్ట్
సన్నీలియోన్ అంటే సాధారణంగా అందరికీ పోర్న్, సినిమా, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలో గుర్తొస్తాయి. అయితే సన్నీ లియోన్‌లో అది ఒక్క కోణం. అతి తక్కువ మందికి మాత్రమే సన్నీలియోన్ గొప్పదనం తెలుసు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని కొత్త జీవితాలను అందిస్తోంది. సొంత పిల్లల్లా ఎంతో అపురూపంగా చూసుకుంటోంది. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా.. సన్నీలియోన్ కాస్త ఎమోషనల్ అయింది.

పిల్లలను దత్తత..
సన్నీ లియోన్ మూడేళ్ల క్రితం ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. భర్త డానియెల్ వెబర్‌తో, పిల్లలతో కలిసి సన్నీలియోన్ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. గతాన్ని అంతా మరిచిపోయి సాధారణ జీవితాన్ని కొనసాగిస్తోంది.

తల్లిప్రేమ..
ఆ మధ్య బయటకు వెళ్లిన సన్నీలియోన్.. తన పిల్లల కోసం ఓ హోటల్‌లో చెఫ్‌గా మారిన విషయం తెలిసిందే. పిల్లలు మారాం చేయడంతో వారికి ఇష్టమైన ఐటెమ్స్ స్వయంగా ఆ హోటల్‌లో వండిపెట్టింది. వాటికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా ఎమోషనల్..
నిషాను దత్తత తీసుకుని మూడేళ్లు కావడంతో సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది. నేడు నిషా బర్త్ డే. ఈ సందర్భంగా సన్నీలియోన్ తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. ఈ మేరకు కుటుంబ సభ్యులందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. అయితే సన్నీ లియోన్ చేసిన పోస్ట్ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.

నిజమైన ప్రేమ..
మూడేళ్ల క్రితం నువ్ మమ్మల్నీ ఎంచుకున్నావ్.. నీ అమ్మనాన్నలుగా మమ్మల్ని కోరుకున్నావ్.. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటామని మా మీద నమ్మకం ఉంచావ్.. మాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించేందుకు వచ్చావ్.. నీపై ఎప్పుడూ కన్నేసి ఉంచాను.. నాకు తెలుసు నువ్ నా కూతురువి.

ఎన్నో ప్రశ్నలు..
నేను నిన్ను ఈ రోజు చూస్తుంటే.. నీవెంతో గొప్ప మహిళవి అవుతావని నీ కళ్లల్లోని వెలుగు నాకు చెబుతోంది. ఈ ఏడాది తరువాత నీవు చాలా ప్రశ్నలను ఎదుర్కొంటావ్.. ప్రతీ అడుగులో నేను వాటన్నంటికీ నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్యూ నిషా. మా జీవితంలోని వెలుగువు నీవు. మేము రోజూ సంతోషంగా ఉండటానికి కారణం నువ్'అని సన్నీలియోన్ ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











