అత్యంత ఖరీదైన కారును కొన్న సన్నీలియోన్.. బ్రాండ్ ఏమిటి? దాని ధర ఎంతంటే
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇంటికి అత్యంత విలాసవంతమైన కారు వచ్చేసింది. ప్రపంచంలోనే ఖరీదైన కార్లలో ఒకటైన మసెరాటీ గిబ్లిని కొనుగోలు చేసినట్టు తన ఇన్స్‌టాగ్రామ్‌లో తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లగ్జరీ కారును కొన్న సన్నీకి తన సన్నిహితులు శుభాక్షాంక్షలు అందజేస్తూ అభినందిస్తున్నారు. ఇంతకు ఈ కారు విశేషాలు ఏమిటంటే..

మసెరాటీ గిబ్లి కారు గురించి
కొత్త కారు గురించి సన్నీలియోన్ వెల్లడిస్తూ.. నాకు చాలా ఇష్టమైన కారు ఇది. ఈ కారు మా కుటుంబంలో భాగస్వామ్యం కావడం నాతోపాటు నా భర్త డేనియల్ వెబర్‌కు గర్వంగా ఉంది. మసెరాటీ గిబ్లి కారును సెప్టెంబర్ 9నే కొన్నాం. ఈ కారు నడిపినప్పుడల్లా ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ కలుగుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తెలిపారు.

షోరూం నుంచే కారు గురించి వీడియో
మెసెరాటీ గిబ్లి కొనుగోలు చేయడానికి కారు షోరూంకు వెళ్లిన సన్నీ అక్కడి నుంచే వీడియోను పోస్టు చేశారు. నా ముందు కొత్త కారు ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నాను. దాని ముందు ఊరికే కూర్చొంటే బోర్‌గా ఉంది అని సన్నీలియోన్ పోస్టు చేశారు. మెసెరాటీ గిబ్లిలో తన భర్త డేనియల్‌తో కలిసి సన్నీలియోన్ ప్రయాణిస్తూ గాల్లో తేలిపోయినంత పని చేశారు. నా జీవితంలో గొప్ప విషయాలు చోటుచేసుకొంటున్నాయి. మెసెరాటీలో ప్రయాణించడం గొప్ప అనుభవం. కారులో భర్తతో వెళ్లూ దిగిన సెల్పీని తన ఇన్సాటాగ్రామ్‌లో పోస్టు చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మెసెరాటీ గిబ్లి కారు ఖరీదు ఎంతంటే
సన్నీలియోన్ కొనుగోలు చేసిన మెసెరాటీ గిబ్లి కారు ఖరీదు ఇండియాలో ఎక్స్ షోరూమ్ ప్రకారం సుమారు రూ.1.44 కోట్లు. అమెరికాలో అీయితే కనిష్టంగా $75,500. ఈ రేంజ్‌లో ఖరీదైన కారును సొంతం చేసుకొన్న సన్నీలియోన్ అభినందిస్తూ.. మీకు ఆ కారు నడిపే అర్హత ఉంది అంటూ ప్రశంసలను నెటిజన్లు గుప్పిస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత కుటుంబంతో అమెరికాకు
భారత్‌లో లాక్‌డౌన్ ఎత్తి వేసిన వెంటనే సన్నిలియోన్ తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. ప్రస్తుతం భర్త డేనియల్ వెబర్, పిల్లలు నిషా, నోహా, అషెర్‌తో కలిసి లాస్ ఎంజెలెస్‌లో ఉంటున్నారు. భర్తతో కలిసి స్విమ్ సూట్‌లో హాట్ హాట్‌గా ఫోటోకు ఫోజులిస్తున్నారు.
Recommended Video

సన్నిలియోన్ కెరీర్ ఇలా..
సన్నిలియోన్ కెరీర్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ సీజన్ 5తో భారతీయ వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జిస్మ్ 2, హేట్ స్టోరి 2, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహేలీ లీలా చిత్రాల్లో నటించారు. తెలుగులో గరుడ వేగ చిత్రంలో ప్రత్యేకమైన పాటలో నర్తించి ప్రేక్షకులను మెప్పించారు. స్ల్పిట్‌విల్లా రియాలిటీ షోలో హోస్ట్‌గా నటించారు.


Click it and Unblock the Notifications











