CCL 2026: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో హ్యాట్రిక్ సంచలనం.. సూపర్ ఓవర్‌లో చెన్నైపై బెంగాల్ ఘన విజయం

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నీలో బెంగాల్ టైగర్స్‌తో జరిగిన వేల్స్ చెన్నై కింగ్స్ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సునాయసంగా గెలుపు బాటలో ఉన్న చెన్నై జట్టు చేజేతులా వికెట్లు పారేసుకొన్నది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో చెన్నై జట్టు 10 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ టైగా నిలిచింది. దాంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ వివరాల్లోకి వెళితే..

సూపర్ ఓవర్‌లో భాగంగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టుకు తొలి బంతికే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్ విక్రాంత్ తొలి బంతిని భారీ షాట్‌గా మార్చే ప్రయత్నంలో బౌండరీ వద్ద ఫీల్డర్‌కు దొరికిపోయారు. ఆ తర్వాత రెండో బంతికి 1 పరుగు లభించింది. మూడో బంతిని శంతను బౌండరీకి తరలించాడు. రాహుల్ మజుందార్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో నాలుగో బంతికి పరుగులేమి రాలేదు. 5వ బంతికి ఒక పరుగుల లభించింది. 6వ బంతికి మరో పరుగు లభించడంతో సూపర్ ఓవర్‌లో చెన్నై 7 పరుగులు చేసింది. పృథ్వీ 5 పరుగులు, శంతను 2 పరుగులు చేశారు. బెంగాల్ జట్టు ముందు 8 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

Bengal Tigers defeated Chennai Kings

సూపర్ ఓవర్‌లో 8 పరుగుల టార్గెట్‌తో బెంగాల్ టైగర్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. బెంగాల్ జట్టు విజయం కోసం జామీ, రాహుల్ మజుందార్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆధావ్ బౌలింగ్ చేసేందుకు రెడీ అయ్యాడు. తొలి బంతికి జామీ సింగిల్ తీశాడు. రెండో బంతికి రాహుల్ సిక్సర్ సాధించాడు. దాంతో స్కోర్ లెవెల్ అయ్యాయి. ఆ తర్వాత రాహుల్ సింగిల్ తీయడంతో విజయం బెంగాల్ టైగర్స్ పక్షాన నిలిచింది. చెన్నై జట్టు చేజేతులా ఓటమిని కోరి తెచ్చుకొన్నది.

అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బెంగాల్ టైగర్స్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. జాయ్ కుమార్ ముఖర్జీ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 65 పరుగులు, ఇంద్రాశీష్ రాయ్ 22 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు, జామీ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు, రాహుల్ మంజుదార్ 22 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో విక్రాంత్ 4 వికెట్లు, పరి ఒక వికెట్ పడగొట్టారు. ముగ్గురు ఆటగాళ్లు రనౌట్ అయ్యారు.

ఆ తర్వాత 186 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శరణ్ కుమార్ 18 పరుగులు, విక్రాంత్ 45 పరుగులు చేశారు. వారిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత జట్టు స్కోర్ 66 పరుగుల వదద్ రెండో వికెట్ రూపంలో విక్రాంత్‌ను కోల్పోయింది. విక్రాంత్ 45 రన్స్ చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత శంతను భాగ్యరాజ్, పృథ్వీ పరుగుల వేగం పెంచారు. దాంతో ఓ దశలో జట్టు విజయం సులభమని తేలిపోయిదంి. శంతను 35, పృథ్వీ 59 పరుగులు చేసి అవుటయ్యారు.

ఆ తర్వాత చెన్నై జట్టును బెంగాల్ బౌలర్ రాహుల్ మజుందార్ కుప్పకూల్చాడు. రాహుల్ 5 వికెట్లు తీయడంతో చెన్నై జట్టు 185 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో బెంగాల్ జట్టు నాలుగు బంతుల్లోనే విజయాన్ని అందుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X