పవన్, మహేష్ వారసులపైనే స్పెషల్ టార్గెట్.. అకిరా, గౌతమ్ ఎంట్రీ ఎప్పుడంటే?

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని నుంచి తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా వారసులు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇకపోతే గత కొలంగా అందరి చూపు పవన్, మహేష్ వారసులపైనే ఉంది. వారి ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలు చాలానే వస్తున్నాయి.

Recommended Video

Mega Fans And Super Star Fans Waiting For Gautham & Akira Nandan Entry
 స్పెషల్ టార్గెట్..

స్పెషల్ టార్గెట్..

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా, ఘట్టమనేని బ్రాండ్ లను మరో స్థాయికి తీసుకువెళ్లడంలో ఇద్దరు సక్సెస్ అయ్యారు. వారికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకొని సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోల లిస్ట్ లో చేరారు. ఇక వీరి వారసులు కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తూ వారికి సంబంధించిన విషయాల గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

వయసు పెరుగుతోంది..

వయసు పెరుగుతోంది..

మహేష్ తనయుడు గౌతమ్ కంటే కూడా పవన్ తనయుడు అకిరా నందన్ పెద్దవాడు. అకిరాకి 16 ఏళ్ళ వయసులోకి రాగా గౌతమ్ ఈ ఆగస్ట్ లో 15 ఏళ్ల వయసులోకి రాబోతున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ తనయుడు వన్ నేనొక్కడినే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత గౌతమ్ మళ్ళీ మరో సినిమా చేయలేదు.

 కాలమే నిర్ణయిస్తుంది..

కాలమే నిర్ణయిస్తుంది..

గౌతమ్ ఘట్టమనేని ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ లో మహేష్ బాబు క్లారిటీ ఇచ్చాడు. ఎంట్రీ ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ లేదు. ఇక అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మెగా అభిమానుల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇంతవరకు ఆ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.

అకిరా ఎటువైపు?

అకిరా ఎటువైపు?

అకిరా నందన్ హైట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆరడుగులు దాటేసి వరుణ్ తేజ్ కంటే ఎక్కువ హైట్ అయ్యాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి అకిరా నందన్ ని కూడా హీరోగా చూడాలని ఫిక్స్ అయ్యాడట. అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీలో చాలా మందికి ఆ కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అకిరా ఎడ్యుకేషన్ పై దృష్టి పెడుతున్నట్లు రేణు దేశాయ్ వివరణ ఇచ్చింది.

 ముందు అతడే..

ముందు అతడే..

అకిరా నందన్ ఇప్పటివరకు తను హీరో అవ్వాలని చెప్పలేదని రేణు దేశాయ్ చెబుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు తన కొడుకు సినిమాల్లోకి రావాలని కొరలేదట. దీన్ని బట్టి పవర్ స్టార్ వారసుడు ఎంట్రీ ఉంటుందా లేదా అనే విషయంలో కొంచెం కూడా స్పష్టత లేదు. ఇక చూస్తుంటే మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని అకిరా కంటే ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రావాలంటే..కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X