For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Krishna No More:అన్నాదమ్ముల్లా తండ్రీకొడుకులు.. కృష్ణ-మహేశ్ బాబు కలిసినటించిన చిత్రాలు

    |

    నటుడు, దర్శకుడు, నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. సినిమా రంగానికి ఒక శకం ముగిసింది. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. తండ్రి మరణం మహేశ్ బాబును కలచివేసింది.

    తనకు ఈ స్థానం వచ్చింది అంటే కేవలం తండ్రి వల్లే అంటూ తరచుగా మహేష్ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను అని సంతోషంగా చెబుతూ ఉండేవారు. అయితే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మహేశ్ బాబు అనేక చిత్రాల్లో కలిసి నటించాడు. అందులో దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఒక్కసారి ఆ వివరాళ్లోకి వెళితే..

     నీడ చిత్రంతో బాలనటుడిగా..

    నీడ చిత్రంతో బాలనటుడిగా..

    తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఘట్టమనేని కృష్ణ. ఆయన అంటే తెలుగు ప్రేక్షకులకు, సెలబ్రిటీలకు అమితమైన గౌరవం. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ లో ఆయన వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దివంగత దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన నీడ చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు తండ్రికి దగ్గ తనయుడిగా పేరు సంపాందించుకున్నాడు.

     సుమారు 10 చిత్రాల్లో..

    సుమారు 10 చిత్రాల్లో..

    సూపర్ స్టార్ కృష్ణకు తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగారు. వీరిద్దరు కలిసి కూడా అనేక చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కలిసి సుమారు 10 చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించినవి కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణతో కలిసి మహేశ్ బాబు బాలనటుడిగా 7 చిత్రాల్లో కలిసి నటిస్తే.. హీరో అయ్యాక 3 సినిమాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

    యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పోరాటం..

    యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పోరాటం..

    మహేశ్ బాబు, కృష్ణ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం పోరాటం. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. 1983 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు అన్నదమ్ములుగా కలిసి నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పోరాటం చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. అలాగే వీళ్లిద్దరు కలిసి మరోసారి శంఖరావం చిత్రంలో నటించారు.

    బజారు రౌడీలో కృష్ణ అతిథి పాత్ర..

    బజారు రౌడీలో కృష్ణ అతిథి పాత్ర..


    1987 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ హీరోగా పాటు దర్శకత్వం వహించారు. పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయం చేయగా మహేశ్ బాబు ఆయనకు కొడుకుగా నటించారు. తర్వాత రమేశ్ బాబు, మహేశ్ బాబు హీరోలుగా నటించిన చిత్రం బజారు రౌడీ. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు.

    నాలుగో చిత్రం ముగ్గురు కొడుకులు..

    నాలుగో చిత్రం ముగ్గురు కొడుకులు..

    1988లో వచ్చిన ఈ బజారు రౌడీ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా మహేశ్ బాబు నటించడం విశేషం. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నిజ జీవిత పాత్రలో కనిపించారు. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కలిసి నటించిన మూడో చిత్రం. తర్వాత వీళ్లిద్దరు కలిసి నటించిన నాలుగో చిత్రం ముగ్గురు కొడుకులు. ఈ సినిమాలో మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా నటించారు.

    గూఢచారి 117 సినిమాలో ఐదోసారి..

    గూఢచారి 117 సినిమాలో ఐదోసారి..

    1988లో వచ్చిన ముగ్గురు కొడుకులు సినిమాకు కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణకు తమ్ముళ్లుగా రమేశ్ బాబు, మహేశ్ బాబు నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. గూఢచారి 117 సినిమాలో ఐదోసారి కృష్ణతో కలిసి నటించారు మహేశ్ బాబు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కృష్ణతో సమానంగా డ్యాన్స్ లు, ఫైట్ లతో ఇరగదీశాడు మహేశ్ బాబు.

    తండ్రీకొడుకులుగా..

    తండ్రీకొడుకులుగా..

    కొడుకు దిద్దిన కాపురం సినిమాతో ఆరోసారి కృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేశ్ బాబు. ఇందులో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇందులో కృష్ణ, మహేశ్ బాబు తండ్రీకొడుకులుగా నటించారు. ఏడో సారిగా అన్నాతమ్ముడు సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. కృష్ణస్వీయ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

    కౌబాయ్ గెటప్ లో..

    కౌబాయ్ గెటప్ లో..

    సూపర్ స్టార్ కృష్ణ-మహేశ్ బాబు కలిసి ఎనిమిదో సారి నటించిన చిత్రం రాజకుమారుడు. ఇందులో కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు. తర్వాత వంశీ చిత్రంలో కలిసి నటించారు. అయితే ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇందులో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హీరోయిన్ గా నటించారు.

    అంటే తండ్రీ కొడుకుతోపాటు కోడలు కూడా నటించిదన్నమాట. ఇక పదో చిత్రంగా టక్కరి దొంగలో కృష్ణ-మహేశ్ బాబు కలిసి నటించారు. టక్కరి దొంగ క్లైమాక్స్ సీన్లో కౌబాయ్ గెటప్ లో వచ్చి అలరిస్తారు కృష్ణ. ఇలా మహేశ్ బాబు-కృష్ణ కలిలి ఏకంగా పది చిత్రాల్లో నటించి అలరించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన శ్రీశ్రీ చిత్రానికి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.

    English summary
    Superstar Krishna Passed Away Due To Cardiac Arrest. Mahesh Babu And His Father Acted As Brother In Films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X