తొలిసారి బికినీలో సుప్రిత.. అందాల ప్రళయం అంటే ఇదేనేమో!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అందులోనూ కొందరు సినిమా వాళ్ల పిల్లలు మరింతగా హైలైట్ అవుతున్నారు. వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు.
తల్లి సినిమా ఆర్టిస్టుగా పాపులర్ అవగా.. కూతురు మాత్రం చిన్న వయసులోనే సెన్సేషన్ అయింది. దీనికితోడు ఇప్పుడు ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమ రచ్చ చేసే సుప్రిత.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

చిన్న వయసులోనే ఫేమస్: సినీ పరిశ్రమకు చెందిన జంట సురేష్ తేజ - సురేఖ వాణి కూతురు సుప్రిత చిన్నప్పుడే ప్రపంచానికి సుపరిచితురాలు అయింది. ముఖ్యంగా టీనేజ్‌లోనే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత ఫుల్ ఫేమస్ అయింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో సుప్రిత కుర్రాళ్లకు క్రష్ అయిపోయింది.

యూట్యూబ్‌లో వీడియోలు: యాక్టింగ్ అంటే మక్కువ చూపించే సుప్రిత 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ప్రయాణం మొదలెట్టింది. ఇందులో ఓ రేంజ్‌లో మెప్పించిన ఈ కుర్రది.. తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను అందించాయి.

సినిమా ఛాన్స్... అమర్‌తో: అందంతో పాటు అభినయంలో హీరోయిన్ మెటీరియల్‌గా కనిపించే సుప్రితను సినిమాల్లోకి తీసుకు రావాలని సురేఖ వాణి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లోని ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో సుప్రిత హీరోయిన్‌గా పరిచయం అవుతుందని అన్నారు. అయితే, ఇప్పుడు ఈ భామ.. అమర్‌దీప్ చౌదరి హీరోగా చేస్తున్న చిత్రంతో రాబోతుంది.

తల్లితో చిల్.. గోవా టూర్‌లో: సినిమాల్లో నటించకున్నా ఫుల్ ఫేమస్ అయిన సుప్రిత.. తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది. ఎందుకంటే ఆమె తన తల్లితో కలిసి చిల్ అవుతూ ఉండడమే. తరచూ వీళ్లిద్దరూ పార్టీలకు, టూర్లకు వెళ్తూ రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ తల్లి కూతుళ్లు కలిసి గోవా టూర్‌కు వెళ్లారు. అక్కడ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో అప్‌డేట్లు పెడుతున్నారు.
అందులో ఫుల్ యాక్టివ్‌గా: సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన సుప్రిత పేరు మారుమ్రోగిపోవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ పిల్ల అందులో యమా యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతూ బాగా హైలైట్ అవుతోంది.

అందాల విందు ఇస్తోంది: చాలా కాలంగానే సోషల్ మీడియాలో యమా హడావిడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత పరువాలను ప్రదర్శిస్తూ తీసుకున్న హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఈ మధ్య అయితే డోస్ పెంచి మరీ గ్లామర్ షో చేస్తోంది. ఫలితంగా సుప్రిత పేరు తరచూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది.

తొలిసారి బికినీలో సుప్రిత: సోషల్ మీడియాలో ఈ మధ్య రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తోన్న సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో కనిపించింది. ఈ ఫొటోల్లో సుప్రిత అందాలు కుర్రకారును బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











