twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోలా ఉండేవాడిని.. అందరూ నా కారును ఆపేవారు.. సురేష్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    |

    మూమీ మొఘల్ రామానాయుడు నిర్మించిన చిత్రాల గురించి తెలుగు చిత్రసీమ ఉన్నంత కాలం మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆయన ఎన్నో అద్భుతమైన క్లాసిక్స్ చిత్రాలను అందించారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సురేష్ బాబు టాలీవుడ్ అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఓ కథను జడ్జ్ చేయడంలో ఆయనకున్న అనుభవమే ఈ స్థాయిలో నిలబెట్టింది.

    అయితే తన కుమారులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి.. ప్రమాదంలోకి నెట్టకూడదని వారికి ఉన్నత చదువులను చెప్పించాడు. కానీ విధి మాత్రం వారిద్దరినీ సినిమా పరిశ్రమకే తీసుకొచ్చింది. నాటి సంగతులను వివరిస్తూ సురేష్ బాబు అనేక విషయాలను వెల్లడించాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

    వ్యాపారరంగంలోకి..

    వ్యాపారరంగంలోకి..

    సురేష్ బాబుకు వ్యాపారరంగంపై మక్కువ ఏర్పడాలని అమెరికాలో ఇంజనీరింగ్‌ను విద్యను అభ్యసించేలా చేశాడు. దానికి తగ్గట్టే సురేష్ బాబు కూడా అమెరికా నుంచి వచ్చాక ఓ స్నేహితుడి సాయంతో ఓ కంపెనీని ప్రారంభించాడట. స్పార్టెక్ సిరామిక్స్ అనే కంపెనీని ప్రారంభిస్తే.. అంతగా వర్కౌట్ కాలేదంటా.

    తండ్రి కార్యాలయంలో కూర్చుంటూ..

    తండ్రి కార్యాలయంలో కూర్చుంటూ..

    ఇక వ్యాపారం అచ్చి రాలేదని తండ్రి ఆఫీస్‌లోనే కూర్చునే వాడంటా. ఆ సమయంలోనే కథలను వినడం, వాటిని జడ్జ్ చేయడం కూడా ప్రారంభించేశాడట. అది స్వతహా తనలో ఉందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాను యుక్త వయసులో ఉండగా జరిగిన సంఘటనను కూడా వివరించాడు.

    కమల్ హాసన్‌లా ఉండేవాడిని..

    కమల్ హాసన్‌లా ఉండేవాడిని..

    తాను ఆ సమయంలో కమల్ హాసన్‌లా ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తమ కార్లు కూడా ఒకే రకమైనవని వివరించాడు. దీంతో జనాలు తననే కమల్ హాసన్ అనుకునేవారు.. కారును ఆపేవారంటూ నాటి సంగతుల గురించి చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Rajamouli Reveals His Next movie Details After RRR
    భారతీ రాజా అడిగారు..

    భారతీ రాజా అడిగారు..

    డైరెక్టర్ భారతీ రాజా గారు కూడా తనను ఓ సినిమా కోసం సంప్రదించారని సీక్రెట్స్ బయట పెట్టాడు. అయితే ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ కూడా నటనపై ఆసక్తి కనబర్చలేదని అందుకే నటనకు దూరంగానే ఉండిపోయానని చెప్పుకొచ్చాడు.

    English summary
    Suresh babu About His Younger Days Looks Like Kamal Haasan. He Says That Even our cars were similar. People would try to stop me, thinking I was Kamal Haasan. I would wave from the car
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X