సూర్య-జ్యోతిక లవ్ స్టోరీ.. ఇలా మొదలై.. అలా ఒక్కటయ్యారు!
తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో తెలిసిందే. కోలీవుడ్ హీరోగా కెరీర్ ను ప్రారంభించినా.. తెలుగు, తమిళ ఆడియెన్స్ ల్లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో సూర్య దిట్ట కావడమే ఇందుకు కారణం. ట్రెండ్ కు తగ్గట్టుగా చాలా రియలిస్ట్ గా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. మరోవైపు మాస్, యాక్షన్ చిత్రాలు, విభిన్న పాత్రలు కూడా పోషిస్తూ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గ్గానే ఉంటున్నారు సూర్య. సినిమాల విషయంలో సూర్య ఎంత శ్రద్ధ వహిస్తుంటారో... ఆయన ఫ్యామిలీ విషయంలోనూ అంతే కేర్ గా ఉంటారు.కుటుంబ సభ్యులంటే సూర్యకు ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కార్తీని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలిసిందే. అటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. సూర్య తన భార్య జ్యోతికను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ చాలా కాలం ప్రేమలో మునిగి తేలారు. 1999లో మొదటిసారిగా సూర్య, జ్యోతిక మధ్య తొలిపరిచయం జరిగింది. తమిళ చిత్రం 'పూవెళ్లం కెట్టుప్పర్' సెట్స్ లో కలిశారు. అప్పటికే సూర్య పలు చిత్రాలతో హీరోగా తమిళులకు పరిచయం అయ్యారు. ఇక జ్యోతికతో ఆయన అది మొదటి చిత్రం. ముంబై కి చెందిన జ్యోతిక నటన మీద ఉన్న ఆసక్తితో తమిళ చిత్రాల్లో అవకాశాలు చూస్తున్న రోజులవి.. ఆ సమయంలోనే సూర్యతో నటించే అవకాశం వచ్చింది.

తొలివారు వారు ఆ మూవీ సెట్ లోనే కలిశారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడటానికి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ముంబై నుంచి వచ్చిన జ్యోతికకు పెద్దగా తమిళం రాదు. దీంతో లాంగ్వేజీ నేర్చుకునేందుకు ఎంతగానో కష్టపడేదంట. అందుకు సూర్య కూడా సహరించే వారంట. జ్యోతిక స్పీడ్ లార్నింగ్ కు సూర్య ఫిదా అయ్యారంట. ఆమె ఏ విషయాన్ని అయినా ఇట్టే నేర్చుకునే స్వభావం నచ్చడంతో కాస్తా పరిచయం స్నేహంగా బలపడింది. అలాగే సూర్య హార్డ్ వర్క్, అతని వ్యక్తిత్వానికి కూడా జ్యోతిక మనస్సులో మంచి స్థానం ఏర్పడింది. ఇలా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేవరకు ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఒకరికొకరు అర్థమవడంతో వారి ప్రేమకు బాటలు పడ్డాయి.
ఐదేళ్ల పాటు వారిద్దరూ రిలేషన్ షిప్ లోనే ఉన్నారు. ఆ సమంలోనే 'కాకా కాకా' తమిళం చిత్రం వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో కలిసి నటించారు. 2003లో ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు చాలానే వచ్చాయి. ఇక అందరిలాగే వీరి లవ్ స్టోరీలోనూ కష్టాలు వచ్చాయి. సూర్య తండ్రి శివకుమార్ వీరి పెళ్లికి నిరాకరించారంట. ఇద్దరి మతాలు వేరవ్వడంతో అస్సలు వద్దనే అన్నాడంట. మూడేళ్లకు ఇంట్లో తెలిసింది. ఆ తర్వాత రెండేళ్లకు పెద్దల అంగీకారంతో సూర్య-జ్యోతిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2006 సెప్టెంబర్ 11న చెన్నైలో వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది.


Click it and Unblock the Notifications











