ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
ఓ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కదిలించడం అంటే మామూలు విషయం కాదు. విమర్శకులు, సినీ ప్రేక్షకుల, సాధారణ నెటిజన్లు ఇలా అందరూ కూడా సూర్య నటించిన సూరారై పొట్రూ (ఆకాశం నీ హద్దురా) అనే చిత్రాన్ని అందరూ గొప్పగా కీర్తించారు. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈచిత్రం ఓటీటీలో ఘన విజయం సాధించింది.అసలు ఇలాంటి సినిమాలను సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సింది. కానీ లాక్డౌన్ వల్ల ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సి వచ్చింది.

సుధా కొంగర అలా..
తక్కువ ధరకే సామాన్యుడు విమానం ఎక్కేలా చేసిన కెప్టెన్ గోపినాథ్ జీవితాంశాలతో సూరారై పొట్రు తెరకెక్కింది. ఆయన రాసుకున్న సింప్లి ఫై అనే నవల ఆధారంగా ఈ మూవీని సుధా కొంగర తెరకెక్కించింది. అయితే సినిమాకు ఎలాంటి అంశాలు అవసరమో అన్నింటిని జోడించి తీయడంతో అందర్నీ ఆకట్టుకుంది.

ప్రశంసల వర్షం..
సూర్య నటన, సుధా కొంగర టేకింగ్, అపర్ణా బాలమురళీ నటన ఇలా ప్రతీ ఒక్క అంశంలో సూరారై పొట్రూ సినిమా అందనంత ఎత్తులో ఉంది. అలాంటి సినిమాపై టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖలందరూ ప్రశంసలు కురిపించారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

ఆస్కార్ బరిలో..
సూరారై పొట్రూ ఆస్కార్ అవార్డు బరిలోనూ నిలిచింది. జనరల్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్‌తో పాటు పలు కేటగిరిల్లో ఈ చిత్రం పోటీ పడబోతోంది. అంతేకాదు ఇవాళ్టి నుంచి ఆస్కార్ రూమ్‌లో ఈ మూవీ ప్రదర్శితం కాబోతోంది.
Recommended Video

సూర్య కష్టానికి ప్రతిఫలం..
అయితే ఈ సినిమాకు ప్రాణం పెట్టి నటించిన సూర్యకు, సుధాకొంగర ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి. మొత్తానికి ఇలా ఆస్కార్ బరిలో సూరారై పొట్రూ నిలవడంతో అందరూ సూర్య నటనను మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జల్లికట్టు కూడా ఆస్కార్ బరిలో ఉందన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











