సుశాంత్ సూసైడ్‌తో విషాదంలో పెంపుడు కుక్క.. అన్నపానీయాలు మానేసి.. ఓదార్చేది ఎవరు?

మనషులకు, జంతువులకు మధ్య ఉండే బంధం ప్రత్యేకమైనదనే విషయం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మరోసారి రుజువైంది. డిప్రెషన్ గురైన సుశాంత్ జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భౌతికంగా దూరమైన సుశాంత్‌ గురించి బాధపడుతూ అందరూ విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం పక్కన పెడితే సుశాంత్ కుక్క పడే బాధ ఇప్పుడు అందరి హృదయాలను తల్లడిల్లేలా చేస్తున్నది.సుశాంత్ అత్యంత ఇష్టమైన కుక్క పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే..

Recommended Video

Sushant Singh Rajput Pet Dog Fudge Heart Breaking Moments

పెంపుడు కుక్క అంటే ఇష్టం

పెంపుడు కుక్క అంటే ఇష్టం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కూడా ఫుడ్జ్ అనే పెంపుడు కుక్కను పెంచుకొన్నారు. దానిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొనే వారు. దానికి చిన్న ఇబ్బంది అయినా తట్టుకొనే వారు కాదు. షూటింగులు లేని సమయంలో ఫుడ్జ్‌తో ఇంట్లో ఆడుకొనే వారు. దానితో గడపడం వల్ల కొంత ఉల్లాసంగా కనిపించేవారు అని ఆయన సిబ్బంది తెలిపారు. ఇక ఫుడ్జ్ కూడా సుశాంత్ అంటే అంతే ప్రేమను చూపించేది అని చెప్పారు.

సుశాంత్ రాకపోయే సరికి డోర్ వద్దకు

సుశాంత్ రాకపోయే సరికి డోర్ వద్దకు

అయితే అనూహ్యంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని భౌతికంగా దూరమయ్యారు. అయితే సుశాంత్ ఇంట్లో కనిపించకపోవడంతో పెంపుడు కుక్క బెంగ పెంచుకొన్నదట. తలుపు శబ్దం అయితే వెంటనే డోర్ వద్దకు వెళ్లి చూసి.. సుశాంత్ కనిపించకపోవడంతో వెంటనే నిరాశతో తిరిగి వచ్చేస్తున్నది. సుశాంత్ రాక కోసం ఎదురు చూస్తూ బాధతో నేలపై పడుకొంటున్నది అనే విషయాన్ని బాధతో చెబుతున్నారు.

ఆహారం, నీళ్లు వదిలేసి.. సుశాంత్ కోసం

ఆహారం, నీళ్లు వదిలేసి.. సుశాంత్ కోసం

సుశాంత్ మరణం తర్వాత ఆయన కనిపించకపోవడంతో అన్నం తినడం లేదు, నీళ్లు కూడా ముట్టడం లేదు. నేలపై బేలగా చూపులు చూస్తూ ఓ రకమైన విషాదంలో మునిగిపోయింది. సిబ్బంది ఎంత ప్రయత్నించినా సాధారణ స్థితికి రావడం లేదు. సుశాంత్ ఉన్న సమయంలో చాలా ఉల్లాసంగా ఉత్సాహం, హ్యాపీగా కనిపించేది. ఇప్పుడు ఫుడ్జ్ పరిస్థితి మరో రకంగా మారింది అంటూ సిబ్బంది వెల్లడించారు.

మొబైల్ ఫోనులో సుశాంత్ బొమ్మను చూస్తూ

మొబైల్ ఫోనులో సుశాంత్ బొమ్మను చూస్తూ

సుశాంత్ పెంపుడు కుక్క ఎంత దయనీయంగా మారిందనే విషయాన్ని సిబ్బంది వెల్లడించారు. ఫోన్‌ స్క్రీన్‌పై సుశాంత్ బొమ్మ కనిపిస్తే అలానే చూస్తూ ఉండిపోతున్నది. స్క్రీన్ ఆఫ్ అయితే సుశాంత్ ఫోటో కోసం కాలితో టచ్ చేసి మళ్లీ ఆన్ చేస్తున్నది. సుశాంత్ బొమ్మను చూస్తేనే నేలపైనే పడి ఉంటున్నది. ఎవరి పిలిచినా స్పందించడం లేదు అని ఇంట్లోని పనిమనుషులు తెలిపారు.

యజమాని కనిపించడం లేదనే బాధతో

యజమాని కనిపించడం లేదనే బాధతో


సుశాంత్ పెంపుడు కుక్క ఫుడ్జ్ విషాదం ఇప్పుడు సోషల్ మీడియాలోను, మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక దానిని ఓదార్చేది ఎలా? తన యజమాని కనిపించడం లేదనే బాధ నుంచి ఫుడ్జ్ బయటకు వస్తుందా? దానిని పరిస్థితి ఏంటనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. సుశాంత్ ఇక లేరనే విషయం ప్రతీ ఒక్కరినే కాకుండా పెంపుడు కుక్కను విషాదంలోకి నెట్టడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

పూరీ జగన్నాథ్‌కు విషాదం..

పూరీ జగన్నాథ్‌కు విషాదం..

కుక్కతో సినీ ప్రముఖుల అనుబంధాలు పలుమార్లు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గతంలో తన పెంపుడు కుక్క మరణంతో దర్శకుడు పూరీ జగన్నాథ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అందుకు కారణాన్ని వివరిస్తూ.. గతంలో తన పెంపుడు కుక్క ఆలనా పాలనను చూసుకొనే తీరిక లేక ఎవరికో అప్పగించారట. దాంతో ఆ కుక్క వాళ్ల ఇంట్లో పచ్చి నీళ్లు కూడా ముట్టలేదట. ఆ కారణంతో మళ్లీ తీసుకొచ్చి ఆ పెంపుడు కుక్కను పూరీ ఇంట్లో వదిలేసి వెళ్లారట. తనన వదిలించుకొనేందుకు ప్రయత్నించారనే కోపంతో తను మరణించే వరకు పూరీని ఆ కుక్క టచ్ కూడా చేయనీయలేదట. ఆ విషయాన్ని వెల్లడిస్తూ తన బాధను పూరీ పంచుకొన్నారు. జంతువుల ప్రేమ, ద్వేషాలకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X