హీరో సుశాంత్ సింగ్ గ్రేట్.. వరద బాధితులకు రూ.1.25 కోట్ల విరాళం!

By Rajababu

కేరళ, నాగాలాండ్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తడంతో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. వరద ముంపుకు గురై ఇబ్బందుల్లో ఉన్న బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భారీ విరాళాన్ని ప్రకటించారు.

నాగాలాండ్ ప్రజలను ఆదుకోవడానికి నాగాలండ్‌లోని దిమాపూర్‌కు వెళ్లి ముఖ్యమంత్రి నీఫియూ రావును కలుసుకొన్నారు. రూ.1.25 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు.

Sushant Singh Rajput donates 1.25 crores for Nagaland flood Victims

నాగాలాండ్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై సీఎం నీఫియూ రావు ప్రశంసల వర్షం కురిపించాడు. సుశాంత్ విరాళం అందించిన తీరు చాలా గర్వంగా అనిపించింది అని రావు ట్వీట్ చేశారు.

నాగాలాండ్‌లో కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచిన సుశాంత్‌కు థ్యాంక్స్. సీఎం రిలీఫ్ ఫండ్‌కు స్వయంగా రూ.1.25 కోట్ల చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మరింత మంది ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి రావు కోరారు.

నాగాలాండ్‌ను వరదలు ముంచెత్తడం వల్ల 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X