సుశాంత్ 6 విలువైన వస్తువుల గురించి తెలిస్తే షాకే.. సూసైడ్‌కు 3 రోజుల ముందే అన్నీ ఫినిష్!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ భౌతికంగా దూరమైనా యువ హీరోకు అత్యంత ఇష్టమైన వస్తువులు అభిమానులకు, కుటుంబాలకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కేవలం సినీ జీవితంలో లక్ష్యాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా భారీగా కలలు, వాటిని సాకారం చేసుకొనేందుకు ప్రయత్నించారనే విషయం అతడు సాధించిన విజయాలు, సొంతం చేసుకొన్న విలువైన వస్తువులు చెప్పకనే చెబుతున్నాయి. ఈ క్రమంలో సుశాంత్‌కు అత్యంత ఇష్టమైన వస్తువులు ఏమిటంటే..
Recommended Video

సముద్రానికి ఎదురుగా ఫ్లాట్
సినీ పరిశ్రమలో కుటుంబానికి చెందని వ్యక్తిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంచెలంచెలుగా ఎదిగాడు. అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకొని కెరీర్ ఆరంభంలోనే విజయాలు సాధించాడు. ఆ క్రమంలో కొందరికే సాధ్యమయ్యే విధంగా ముంబైలోని బాంద్రాలో సముద్ర తీరానికి ఫేస్ చేసి ఉన్న ఇంటిని సొంతం చేసుకొన్నారు. కొనుగోలు చేసిన సమయంలో దాని ఖరీదు 20 కోట్లు రూపాయలు.

ధోని బయోపిక్ తర్వాత ఖరీదైన కారు..
ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో నటించిన తర్వాత తొలిసారి బాలీవుడ్‌లో రూ100 కోట్ల హీరోగా ఘనతను సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత విలాసవంతమైన కారు నీలిరంగులో ఉండే మెసెరాటీ క్వాట్రోపొర్టేను కొన్నారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. కొన్ని సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ఖరీదు రూ.1.5 కోట్లు.

విలాసవంతమైన రేంజ్ రోవర్ కారు
ఇక సుశాంత్ సినిమాలు విజయాలు సాధించడం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న క్రమంలో విలాసవంతమైన రేంజ్ రోవర్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేశారు. ఆ కారు విలువ సుమారు రూ.50 లక్షలు. బీ గ్రేడ్ హీరోలు ఎవరూ సొంతం చేసుకోలేని కారు ఇది.

మిషన్ ఇంపాసిబుల్ చూసిన తర్వాత
హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ 2 మూవీ చూసిన తర్వాత సుశాంత్‌కు బైక్‌లపై మోజు పెరిగిందట. ఆ తర్వాత అత్యంత ఖరీదైన బైక్స్‌లో ఒకటైన BMW K1300 R అనే బైక్‌ను సొంతం చేసుకొన్నారు. దాని స్పీడ్, స్టైయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొంటారు. సుశాంత్ వద్ద ఉన్న విలువైన వస్తువుల్లో ఇది ఒకటి.

ఖరీదైన టెలిస్కోప్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కేవలం సినిమాలపైనే కాదు.. శాస్త్ర, సాంకేతిక అంశాలపై మంచి పట్టు ఉంది. అంతరిక్షం, టెలిస్కోప్, రాకెట్ సైన్స్ లాంటి విషయాలపై మంచి పరిజ్ఞానం ఉంది. ఆ క్రమంలో చంద్రమండలంపై స్థలాన్ని కొనుకొన్నాడు. అంతేకాకుండా పెద్దసైజు Meade 14" LX600' టెలిస్కోప్‌ను కూడా కొనుగోలు చేసి అంతరిక్ష పరిశోధనపై దృష్టిపెట్టారు. ఓసారి వేదికపై సుశాంత్‌ను టెలిస్కోప్ విషయంపై గేలి చేశారు. నీ ఇంట్లో టెలిస్కోప్ ఉందంట.. ఫ్లాట్‌లో కింద, పైన అంతస్థుల్లోని వారిని చూస్తావా? అంటూ సెటైర్లు వేయడం గమనార్హం. సుశాంత్ వద్ద ఉన్న టెలిస్కోప్ ఖరీదు రూ.10 లక్షలు.

విలువైన బ్రాండెడ్ గడియారాలు
సుశాంత్‌కు అత్యంత ఇష్టమైన వాటిలో గడియారాలు, దస్తులు కూడా ఉన్నాయి. ఖరీదైన వాచీలు ధరించడం అంటే సుశాంత్‌కు చెప్పలేనంత మక్కువ. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే కొత్త బ్రాండ్స్ ఎప్పుడూ వచ్చినా వాటిని పట్టుబట్టి కొనేవారు అని స్నేహితులు చెప్పుకొంటారు. సుశాంత్ వద్ద ఫారిన్ బ్రాండ్, స్వదేశీ బాండ్ గడియారాలు చాలానే ఉన్నాయని చెప్పుకొంటారు.

సూసైడ్‌కు మూడు రోజుల ముందే జీతాలు చెల్లింపు
ఇక ఆస్తులు, విలువైన వస్తువుల జాబితాను పక్కన పడితే.. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడంలో చాలా నిజాయితీగా, కచ్చితంగా ఉంటారనేది స్నేహితులు, సన్నిహితులు వెల్లడిస్తారు. సుశాంత్ మరణానికి మూడు రోజుల ముందు తన వద్ద పనిచేసే సిబ్బంది, ఇతర టీమ్ మెంబర్స్‌కు జీతాలు ఇచ్చేశారు. తన మరణం తర్వాత వారికి జీతాలు ఇవ్వరేమో అనే విషయంతో ముందే ఇచ్చి ఉంటారని తన టీమ్ మెంబర్స్ పేర్కొన్నారు. జీతాలు అందుకొన్న ఓ సిబ్బంది స్పందిస్తూ.. మా జీవితానికి ఎంతో చేశారు.. ఏదైనా అవకాశం వస్తే ముందు రోజుల్లో సహాయం చేయడానికి సిద్దంగా ఉంటాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











