twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్ ఒకేలా.. వారికి బతికే అర్హత లేదు... మాధవీలత సుధీర్గమైన పోస్ట్

    |

    బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. డిప్రెషన్ కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. దీంతో ఒక్కసారి వారసత్వం, ఇండస్ట్రీ గుత్తాధిపత్యంపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నెపోటిజంపైనే చర్చలు నడుస్తున్నాయి. తాజాగా మాధవీలత సుశాంత్ మరణంపై స్పందిస్తూ.. డిప్రెషన్ గురించి తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Madhavi Latha Reacts On Sushant's సూసైడ్ And How The Depression ఎఫెక్ట్స్
    క్యాన్సర్ కంటే పెద్దది..

    క్యాన్సర్ కంటే పెద్దది..

    (ప్రతి వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు వేరే వేరే కారణాలుంటాయి.. డబ్బు, పేరు లేదా కీర్తి గురించి కాదు మనస్సు , అప్పటి పరిస్థితుల గురించి అయి ఉండొచ్చు. డిప్రెషన్ ఇది ఎంత బాధాకరమైనదో నాకు తెలుసు ... ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కూడా ఇందులో ఒక పెద్ద అంశం ... అందరూ డిప్రెషన్ ఒక చిన్న సమస్య అని అనుకుంటారు. కానే కాదు.. ఇది క్యాన్సర్ లేదా అంత కంటే పెద్దది.

    ఎంతో శక్తి అవసరం..

    ఎంతో శక్తి అవసరం..

    కారణాలు భిన్నంగా ఉండవచ్చు కానీ, కొన్నిసార్లు స్నేహితులు, కుటుంబం, వైద్యులు, టాబ్లెట్‌లు కూడా సహాయం చేయలేవు. మనకు దాన్ని ఎదిరించడానికి ఎంతో శక్తి అవసరం.. సాధారణ ప్రజలకు దాని విలువ తెలియదు. దాని నుండి ఎవరు బయటకు వచ్చారో వారికే మాత్రమే అది ఎంత కష్టమో తెలుస్తుంది. డిప్రెషన్ అనేది జ్వరం లేదా జలుబు వంటి చిన్నదిగా అనిపిస్తుంది. కాని కాదు అదో పెద్ద రోగం. మెదడు హృదయాన్ని చివరకు శరీరాన్ని క్షీణింపజేస్తుంది.

    పోరాడే శక్తి..

    పోరాడే శక్తి..

    ఈ భూమిపై బరువు తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గం. మీరంతా క్రూరమైన వాళ్లు. దయాగుణం లేని వారు. మీ అందరికి మనుషులుగా జీవించడానికి అర్హత లేదు. మీరు జీవించాలనుకుంటే ఎమోషన్స్‌తో బతకండి.. లేదా అడవుల్లోనో గుహల్లోనో జీవించండి. ఏది ఏమైనా డిప్రెషన్‌తో పోరాడే శక్తిని నాకు ఇచ్చినందకు దేవుడుకు ధన్యవాదాల'ని తెలిపింది. అంతేకాకుండా సుశాంత్, ఉదయ్ కిరణ్ మృతి ఒకేలా ఉందని ఓ ఫోటోను షేర్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో బతకలేమోనని ఆ ఫోటోపై రాసి ఉంది.

    English summary
    Sushant singh Rajput Suicide madhavi latha About Depression. she says that every person has a different reasons for having suicidal tendency Its not all about money , name or fame its all about mind and the situations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X