ధోని కూతురుతో సుశాంత్.. చిన్నారితో మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి వారం గడిచిపోయినా ఇంకా అభిమానులు ఆయనను మరచిపోలేకపోతున్నారు. సోషల్ మీడియాలోని ఆయన జాపకాలను వెతికి వెతికి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ కెప్టెన్ ధోని కూతురుతో దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫోటో వెనుక కథ ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput, Ankita Lokhande Best Moments Viral in Internet
ఎంఎస్ ధోని బయోపిక్‌తో

ఎంఎస్ ధోని బయోపిక్‌తో

టెలివిజన్ నుంచి సినీ రంగానికి వచ్చిన తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్‌లో నటించే అవకాశం రావడంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జాతకం మారిపోయింది. ధోని పాత్రలోకి సుశాంత్ పరకాయ ప్రవేశం చేసిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ తర్వాత ధోని, సుశాంత్ స్నేహితులుగా మారిపోయారు. వారి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.

ఎంఎస్ ధోని ఫ్యామిలీతో సుశాంత్

ఎంఎస్ ధోని ఫ్యామిలీతో సుశాంత్

అలా ధోనితో సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత 2015లో డిసెంబర్‌లో ధోని, సాక్షి ధోనిని కలిసిన సందర్భంలో జీవా ధోని ఎత్తుకొని ముద్దాడుతూ దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు చేశారు. ముద్దులొలికే చిన్నారి జీవాతో నేను అంటూ సుశాంత్ కామెంట్ కూడా పోస్టు చేశారు.

సుశాంత్ ప్రియురాలు, అంకితతోపాటు

సుశాంత్ ప్రియురాలు, అంకితతోపాటు

ఆ సమయంలో సుశాంత్, అంకితా లోఖండే డేటింగ్ చేస్తు ఉండటంతో తన ప్రియురాలిని కూడా వెంట తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు అంకితా కూడా జీవా ధోని ఎత్తుకొని సంతోషంలో మునిగిపోయారట. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో అంకిత ఫోటోను షేర్ చేసింది. జీవాతో అంకిత అంటూ క్యాప్షన్ కూడా జత చేర్చింది.

ధోని ఫ్యామిలీతో డిన్నర్

ధోని ఫ్యామిలీతో డిన్నర్


ధోని ఫ్యామిలీని కలిసిన సమయంలో సుశాంత్ సింగ్, అంకితా లోఖండే మధురమైన సమయాన్ని గడిపినట్టు తెలుస్తున్నది. ఆ సమయంలో అందరూ కలిసి డిన్నర్ చేసినట్టు కూడా పోస్టును బట్టి అర్థమైంది. అంకిత చేసిన పోస్టులో సాక్షి, ధోని, డిన్నర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఉండటం కారణంగా వారంతా గుడ్ టైమ్‌ను ఎంజాయ్ చేసినట్టు స్పష్టమవుతున్నది.

ధోని బయోపిక్ షూటింగ్ సమయంలో

ధోని బయోపిక్ షూటింగ్ సమయంలో


అయితే ధోని బయోపిక్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ధోని ఫ్యామిలీని సుశాంత్, అంకిత కలిసి ఉంటారు. ఎందుకంటే ధోని బయోపిక్ చిత్రం సెప్టెంబర్ 2016లో రిలీజైన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌తో కియారా అద్వానీ, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. అనుపమ్ ఖేర్, భూమిక కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X