twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముందు రోజు గ్రాండ్ పార్టీ.. సీసీటీవీ పుటేజ్ మాయం.. సుశాంత్ మృతిపై కొత్త అనుమానాలు

    |

    సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై రోజుకో రకమైన చర్చ జరుగుతోంది. డిప్రెషన్ కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పటి వరకు అంతా అనుకుంటూ ఉండగా తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన చివరి ఫోటోలను చూస్తుంటే అది ఆత్మహత్యగా కనిపించడం లేదని ప్రీ ప్లాన్డ్ మర్డర్‌గా అనిపిస్తోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కొందరు సుశాంత్ మృతిపై కొన్ని అనుమానాలు, మరికొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. అవేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Sushant : ఉరి వేసుకుంటే నాలుక బయటకు రావాలి గా ? ప్రీ ప్లాన్డ్ మర్డర్‌ అంటూ Netizens పోస్ట్ లు
    సీసీటీవీ పుటేజ్ మాయం..

    సీసీటీవీ పుటేజ్ మాయం..

    సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి నుంచి ఆ కాంప్లెక్స్‌లోని సీసీటీవీ పుటేజ్ ఆగిపోయింది. అంతే కాకుండా ఆ రాత్రి సుశాంత్ ఇంటికి స్నేహితులు కూడా వచ్చారట. గ్రాండ్ పార్టీ చేసుకున్నారట. పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన మ్యూజిక్ వినిపించిదని తెలుస్తోంది. డిప్రెషన్‌గా ఉన్నాడని ఏ మాత్రం అనిపించలేదట.

    ఫొరెన్సిక్ రిపోర్ట్..

    ఫొరెన్సిక్ రిపోర్ట్..

    అంతేకాక తాను వాడిన బెడ్ షీట్‌పై ఎడమ చేతి బొటన వేలు, చిటికన వేలి ముద్రలు తప్పా ఇంకెమీ కనిపించలేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పుకొచ్చింది. అయితే సుశాంత్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ కాదు. తనకు తానుగా ఎడమ చేతితో ఉరివేసుకుని చనిపోయే అవకాశం లేదని చెబుతున్నారు.

    కళ్లు పెద్దవిగా, నాలుక బయటకు..

    కళ్లు పెద్దవిగా, నాలుక బయటకు..

    మామూలుగా ఉరి వేసుకుంటే కళ్లు పెద్దవిగా మారాలని, నాలుక బయటకు రావాలని కానీ అలాంటేవీ జరగలేదు. ఆయన ఫ్లాన్ డూప్లికేట్ కీ కూడా మిస్ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు ఇది సూసైడా? అంటూ రాసి ఉన్న ఓ సుధీర్ఘమైన పోస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.

    ఓ అడ్వకేట్ ప్రశ్నలు..

    ఓ అడ్వకేట్ ప్రశ్నలు..

    ఎన్నో కేసులను పరిశీలించిన ఓ న్యాయవాది సైతం కొన్ని ప్రశ్నలను సంధించాడు. సుశాంత్ చివరి ఫోటోలను చూసిన వెంటనే నాకు ఇది మర్డర్ అని అనిపించింది. ఆయన మెడకు ఉరి వేసుకున్న అచ్చు స్ట్రెయిట్‌గా ఉంది వంగిపోకుండా.. లాలాజలం కూడా బయటకు రాలేదు.. నాలుక, కనుగుడ్లు కూడా సాధారణంగానే ఉన్నాయి. బయటకు రాలేదు.

    సీబీఐ ఎంక్వైరీ..

    సీబీఐ ఎంక్వైరీ..


    సుశాంత్ మరణానికి సంబంధించిన కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతుండటంతో సీబీఐ ఎంక్వైరీ జరపాలని కొందరు కోరుతున్నారు. ఈ మేరకు సుశాంత్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. పోలీసు విచారణ అనంతరం ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.

    English summary
    Sushant Suicide Grand Party held Before Night In his Flat. Nertizens Demands CBI Enquiry On Sushants Suicide Case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X