కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ ఎమోషనల్ వీడియోలు.. రోడ్లపై జీవించే వారితో ప్రేమగా..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయాడు అంటే ఈ స్థాయిలో జనాలు రియాక్ట్ అవ్వడానికి కారణం అతని మంచితనమే. జీవితానికి స్పూర్తినిచ్చే సినిమాలు తీసిన వ్యక్తి నిజం జీవితంలో అలానే ఉంటాడా అంటే అదొక సందేహమే. అయితే సుశాంత్ మాత్రం అలా కాదు. మనుషులను గౌరవించడంలో ముందుటాడు. కొన్ని సందర్బల్లో సుశాంత్ అభిమానులను కలుసుకున్న విధానం చూస్తే.. ఎవరికైనా సరే కన్నీళ్లు వచ్చేస్తాయి.
Recommended Video

క్రమశిక్షణతో..
కష్టపడే గుణమున్న సుశాంత్ సింగ్ ఒక స్టార్ గా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక డ్యాన్సర్ స్థాయి నుంచి హీరో అయ్యే వరకు వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో పలు సందర్బల్లో అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. అయినా కూడా తన గోల్ కోసం క్రమశిక్షణతో మెలిగాడు.
సుశాంత్ ఒక్కడే..
సుశాంత్ మనసు ఎంత మంచిది అంటే.. ఒక పార్టీకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన జీవించే పేదలు ఎగబడి వస్తే.. తోటి సెలబ్రెటీస్ వారికి దూరంగా వెళ్లిపోగా.. సుశాంత్ ఒక్కడే వారిని కలిసి ఫోటోలకు పొజిచ్చాడు. ఒకసారి ఫ్రెండ్ ఫంక్షన్ కి ముంబై వీధిలోకి వెళ్లగా అక్కడ రోడ్డు ఒక్కన బెలూన్స్ అమ్ముకునే వాళ్ళు కూడా సుశాంత్ ని చూడటానికి రాగా.. సుశాంత్ ఏ మాత్రం సందేహించకుండా వారితో ఫొటోలు దిగాడు.

అభిమానుల సంతోషం..
సాధారణంగా కొంతమంది స్టార్స్ బాడీగార్డ్స్ సెక్యురిటీ లేనిదే బయటకు రారు. ఎక్కడికైనా వెళితే.. ముందే జనాలు పక్కకు రాకుండా బాడీగార్డ్స్ ని పెట్టమని అంటారు. కానీ సుశాంత్ ఎక్కడికైనా సరే సెక్యూరిటీ లేకుండానే వెళతాడు. ఎందుకంటే ఫ్యాన్స్ ని ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని వారి సంతోశాన్ని మనం అర్థం చేసుకోవాలని పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు.
కంటతడి పెట్టిస్తున్నాయి..
ఒక వీడియోలో అయితే సుశాంత్ ఒక చిన్నారికి ఆహారం తినిపిస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది. సుశాంత్ పెద్దగా ప్రమోషన్స్ చేసుకోలేదు గాని తన డబ్బుతో కొంత మంది ఆడపిల్లలను కూడా చదివిస్తున్నాడని చాలా ఆలస్యంగా తెలిసింది. అతని విషయాలు తెలుసుకుంటున్న అభిమానులకు ఈ వీడియోలు కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. ఏదేమైనా సుశాంత్ మరణం ఒక నమ్మలేని నిజం.


Click it and Unblock the Notifications











