లవర్‌తో కలిసి హాట్ ఫోజులు: తన కన్నా చిన్నవాడితో రొమాన్స్.. షాకిస్తోన్న హీరోయిన్‌ తీరు.!

By Manoj Kumar P

మోడలింగ్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి.. ఎన్నో అవార్డులను అందుకుని.. మిస్ యూనివర్శ్‌గా నిలిచింది సుస్మితా సేన్. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమె.. అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఎన్నో ఆఫర్లు దక్కించుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్‌గా ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న ఈమె.. కొద్ది రోజులుగా వివాదాస్పద తీరుతో హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె తనకంటే చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

అప్పటి నుంచి కనిపించని సుస్మితా సేన్

అప్పటి నుంచి కనిపించని సుస్మితా సేన్

మోడలింగ్ రంగంలో సత్తా చాటడంతో సుస్మితా సేన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. యూనివర్శ్ కిరీటాన్ని అందుకున్న వెంటనే అంటే 1996లో ‘దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరించింది. 2015లో వచ్చిన బెంగాల్ చిత్రం ‘నిర్భాక్' తర్వాత ఆమె కనిపించలేదు.

వాటితో పాటు ఎన్నో అవార్డులు సొంతం

వాటితో పాటు ఎన్నో అవార్డులు సొంతం

1994లో సుస్మితా సేన్ మిస్ ఇండియా పోటిల్లో గెలుపొందింది. అదే సంవత్సరం జరిగిన మిస్ యూనివర్శ్ కాంపిటీషన్‌లో సైతం విజయం సాధించింది. ఇక, సినిమాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ సహా ఎన్నో అవార్డులు దక్కాయి. అయితే, సినీ కెరీర్‌లో ఆమె అందుకున్న అవార్డుల్లో ఎక్కువ శాతం సహాయ నటిగా చేసినందుకే వచ్చాయి.

 హీరోలతో ప్రేమ.. పెళ్లి కాకుండానే పిల్లలు

హీరోలతో ప్రేమ.. పెళ్లి కాకుండానే పిల్లలు

ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో సుస్మితా సేన్‌ ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో పలువురు హీరోలతో ప్రేమాయణం కూడా సాగించింది. అప్పట్లో ఈ వ్యవహారాలతో సుస్మితా ఎన్నో వివాదాలను కొని తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె వివాహం చేసుకోలేదు. కానీ, తల్లి కావాలన్న ఆశతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది.

15 ఏళ్లు చిన్నవాడితో డేటింగ్ చేస్తోంది

44 ఏళ్ల సుస్మితా సేన్ పెళ్లి చేసుకునేందుకు ఇష్ట పడలేదు. కానీ, చాలా మందితో డేటింగ్ మాత్రం చేసిందని బీటౌన్‌లో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక, కొద్ది రోజులుగా ఆమె రొహమన్ షాల్ (29) అనే ఈ యువ మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఏకంగా అతడని ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టుకుంది. దీంతో ఆమె వ్యవహార శైలిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

లేటు వయసులో అదిరిపోయే రొమాన్స్

రొహమన్ షాల్‌తో డేటింగ్ చేస్తుందన్న ప్రచారం మొదలైన తర్వాత సుస్మితా సేన్ మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే అతడితో కలిసి రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. వీటిలో ముద్దులు పెట్టుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి. ఇవి బయటకు వచ్చిన తర్వాత సుస్మితా సేన్ అతడిని పెళ్లాడబోతుందని వార్తలు వస్తున్నాయి.

Recommended Video

HIT Movie Opening Ceremony || Nani || Vishwak Sen ||
లవర్‌తో కలిసి సుస్మితా హాట్ ఫోజులు

లవర్‌తో కలిసి సుస్మితా హాట్ ఫోజులు

తన వివాదాస్పద తీరుతో ఇప్పటికే పలుమార్లు వార్తల్లోకి ఎక్కిన సుస్మితా సేన్.. తాజాగా మరోసారి చర్చనీయాంశం అవుతోంది. దీనికి కారణం.. తన ప్రియుడితో కలిసి హాట్ హాట్ ఫోజులతో వర్కౌట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేయడమే. ఒకరిపై ఒకరు పడుకుని ఉన్న ఈ ఫొటోలు చూసి నెటిజన్లు.. సుస్మితా సేన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X