చిరంజీవికి హెయిర్ కట్ చేస్తున్న మెగా డాటర్.. ప్రతీ చిన్న విషయంలో నమ్మావంటూ ఎమోషనల్
మెగా డాటర్ సుష్మిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురుగానే కాకుండా.. చిరు సినిమాల కోసం ఎంతో శ్రద్దగా పని చేసే ఓ టెక్నీషియన్‌గానూ అందర్నీ మెప్పించింది. ఖైదీ నంబర్ 150, సైరా సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా తన పనితనంతో ప్రేక్షకులకు కట్టిపడేసింది. తన తండ్రితో ఉన్న ప్రేమానుబంధం గురించి సుష్మిత ఇదివరకు ఎన్నోసార్లు మీడియా ముఖంగానే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి చిరంజీవిపై ఉన్న ప్రేమను చాటి చెప్పింది. నేటి ఫాదర్స్ డేను పురస్కరించుకుని సుష్మిత ఓ వీడియోను షేర్ చేసింది.

స్పెషల్ కేర్..
ఖైది నెంబర్ 150 కోసం క్యాస్టూమ్ డిజైనర్‌గా ఉన్నప్పుడు నాటి సంగతులను పంచుకుంటూ చిరును ఎంత జాగ్రత్తగా చూసుకుందో చెప్పుకొచ్చింది. సాంగ్స్ షూట్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ డైట్ విషయంలో, క్యాస్టూమ్ విషయంలో జాగ్రత్తగా చూసుకున్నాని పేర్కొంది. ఆయనకు కంఫర్ట్‌గా అనిపిస్తూనే ఫ్యాన్స్ మెచ్చేలా క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేశానని తెలిపింది.

సైరా కోసం శ్రమ..
సైరా సినిమా కోసం మాత్రం దాదాపుగా రెండేళ్లు శ్రమించానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఫ్యామిలీకి కాస్త ఇబ్బందులు ఏర్పడటంతో అంతా హైద్రాబాద్‌కే షిఫ్ట్ అయ్యామని పేర్కొంది. సైరా పాత్ర కోసం ఎంతో పరిశోధించామని, గెటప్, లుక్స్ గురించి ఎంతో రిసెర్చ్ చేశామని తెలిపింది. తాజాగా తండ్రిపై ఉన్న ప్రేమను, తండ్రి గొప్పదనం గురించి చెప్పుకొచ్చింది.

ఫాదర్స్ డే స్పెషల్..
ఫాదర్స్ డే సందర్భంగా సినీ సెలెబ్రిటీలంతా ఎమోషనల్ అవుతున్నారు. ఈ మేరకు చిరంజీవి, రామ్ చరణ్, నిహారిక, మహేష్ బాబు, సితార చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా సుష్మిత చిరంజీవి కోసం హెయిర్ స్టైలిష్ట్‌గా మారింది. లాక్ డౌన్‌లో బయటకు వెళ్లలేని కారణంగా ఇలా చేశామని, తన లాక్ డౌన్ యాక్టివిటీస్ అంటూ పేర్కొంది.
Recommended Video

తండ్రి అంటే అదే..
ఫాదర్స్ డే విషెస్ చెబుతూ సుష్మిత.. ‘నువ్ చూపించే ప్రేమకు థ్యాంక్యూ డాడ్ .. హెయిర్ కట్ చేసే చిన్న విషయం నుంచి నా జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాల్లోనూ నన్ను నమ్మావ్. అవే ఈ రోజు నన్ను కాన్ఫిడెంట్ ఉన్న మనిషిలా తయారు చేశాయ్. అదే తండ్రి అంటే.. వారు మా సాధికారత కోసం ఏదైనా చేస్తారు. లవ్యూ హ్యాపీ ఫాదర్స్ డే' అని పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











