AP Election Counting: వైఎస్ జగన్ కంటే పవన్ కల్యాణ్‌కే ఎక్కువ.. మెజారిటి ఎంతో తేల్చేశారుగా!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కొన్ని చోట్ల విధ్వంసంతో, మరికొన్ని చోట్ల ప్రశాంతంగా ముగిసాయి. ఓటరన్న తీర్పు స్ట్రాంగ్ రూమ్‌లో నిక్షిప్తమైంది. ఇక రాజకీయ నేతల భవిష్యత్తు ఏమిటనే ఓటరు చేతిలోనే ఇంకా ఉంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు.. వెల్లడయ్యే ఫలితాలతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓటమి పాలవతారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఓ పార్టీ ఓడి పోతుందనే విషయం అత్యంత చర్చనీయాంశమైంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత అనేది మరో ఎత్తుగా చర్చ జరుగుతున్నది. అయితే పవన్ కల్యాణ్ గెలుపుపై వర్మ చేసిన విశ్లేషణ ఏమిటంటే?

పవన్ కల్యాణ్ ప్రశ్నించే వ్యక్తి. 2009 నుంచి ఆయన ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. రెండు చోట్ల ఓటమిపాలైనప్పటికీ.. పదవి కోసం కాకుండా ప్రజల కోసం ప్రశ్నిస్తూ వచ్చారు. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి నడిపించాలంటే.. ప్రభుత్వ ఓటు చీలకూడదు అనే నినాదంతో తెలుగు దేశం, బీజేపీతో జనసేన కూటమి కట్టేలా చేయడంలో సక్సెస్ అయ్యారని పిఠాపురం కూటమి ఇంచార్జ్ శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ అలియాస్ ఎస్‌వీఎస్ఎన్ వర్మ అన్నారు.

SVSN Varma predicts Pawan Kalyan gets 1 lakh Majority in Pithapuram than YS Jagan in Pulivendula

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఓటు పక్కాగా ట్రాన్స్‌ఫర్ అయింది. పిఠాపురంలో 2 లక్షల 4 వేలకుపైగా ఓట్లు పోలయ్యాయి. పవన్ కల్యాణ్‌కు 1 లక్ష 50 వేల ఓట్లు వస్తాయి. ఆయనకు మొత్తంగా 1 లక్ష మెజారిటీ వస్తుంది అని వర్మ జోస్యం చెప్పారు.

ఏపీలో అత్యధిక మెజారిటీ సాధించే నాయకుల్లో పవన్ కల్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. ఒక 5 వేలు, 10 వేలు అటు ఇటు అయినా రాష్ట్రంలో టాప్ మెజారిటీ వచ్చేది పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కే అంటూ వర్మ బల్లగుద్ది చెప్పారు. పులివెందులలో వైఎస్ జగన్ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. 2019లో వైఎస్ జగన్‌తో సమానంగా నాకు మెజారిటీ వచ్చింది అంటూ వర్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ చాలా మంచి వ్యక్తి. అత్యంత నిజాయితీ పరుడు. నేను చాలా తక్కువ ప్రయాణంలో ఆయన ఆలోచనలకు ఆకర్షితులయ్యాను. ఆయన నడవడిక, మాట తీరు, ఎదుటి వారిని గౌరవించే తీరును చూసి ముచ్చటపడ్డాను. అందుకే ఆయనను గెలిపించే బాధ్యతను నేను తీసుకొన్నాను. అందరం కలిసి పనిచేశాం అని వర్మ అన్నారు.

ఏపీలో అత్యధిక మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం పిఠాపురం. ఈ అసెంబ్లీ స్థానంలో పోలైన ఓట్లలో 70 శాతం నుంచి 80 శాతం వరకు పవన్ కల్యాణ్‌కు ఓట్లు పడ్డాయనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయలను వెల్లడిస్తున్నారు. అయితే ఈ విశ్లేషకులు, పార్టీ నేతల జోస్యం ఫలిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X