సైరా సినిమానే కాదంటూ.. మెగా ఫ్యాన్స్ షాకింగ్ పోస్టర్

తెలుగు రాష్ట్రాల్లో రెండు పండగలు ఒకేసారి వచ్చేశాయి. దసరా పండగతో పాటు సైరా నరసింహా రెడ్డి రూపంలో వెండితెర పండగొచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై ఉయ్యాలవాడ వీరుడి పౌరుషం, తెగువ చూసి తమలో నూతనోత్సాహాన్ని నింపుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. సరిగ్గా ఈ తరుణంలో సైరా గొప్పతనం చెప్పేలా ఆన్‌లైన్ వేదికపై షికారు చేస్తున్న ఓ పోస్టర్ మెగా అభిమానుల చేత ఔరా! అనిపిస్తోంది.

ఎక్కడ చూసినా సైరా ముచ్చట్లే

ఎక్కడ చూసినా సైరా ముచ్చట్లే

ఈ దసరా వేల ఎక్కడ చూసినా సైరా ముచ్చట్లే. ఈ నేపథ్యంలో కొందరు ఫ్యాన్స్ సైరా నరసింహా రెడ్డి సినిమాలోని క్యారెక్టర్స్‌ని వర్ణిస్తూ ఓ పోస్టర్ డిజైన్ చేశారు. 7 పాయింట్లలో సైరా క్యారెక్టర్స్ అన్నింటి గురించి అద్భుతంగా వివరించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

భారీ సినిమా.. వివిధ భాషా నటులు

భారీ సినిమా.. వివిధ భాషా నటులు

భారీ హంగులతో హై టెక్నికల్ వాల్యూస్‌తో సైరా నరసింహా రెడ్డి కథకు ప్రాణం పోశారు మేకర్స్. రామ్ చరణ్ నిర్మాణ విలువలు, మెగాస్టార్ పక్కన వివిధ భాషా నటుల పర్‌ఫార్‌మెన్స్ తెలుగు తెరకు వన్నె తెచ్చాయి. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా నటన సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ తాజా పోస్టర్‌లో అద్భుతమైన సందేశం పొందుపర్చారు మెగా ఫ్యాన్స్.

చిత్రం మాత్రమే కాదు జీవన విధానాన్ని చూపించిన అద్భుతం

చిత్రం మాత్రమే కాదు జీవన విధానాన్ని చూపించిన అద్భుతం

'ఇది చిత్రం మాత్రమే కాదు జీవన విధానాన్ని చూపించిన అద్భుతం' అని పేర్కొంటూ సైరా లోని అన్ని క్యారెక్టర్స్‌కి సరైన డెఫినేషన్ ఇచ్చారు. ఒక అమ్మాయి ఎలా ఉండాలో తమన్నాను చూసి నేర్చుకోవచ్చు అని, అలాగే ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో కిచ్చా సుదీప్ చూపించాడని తెలిపారు.

విజయ్ సేతుపతి రుజువు చేశాడు

విజయ్ సేతుపతి రుజువు చేశాడు

మనకి అయిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారని చాలా బాగా చూపించారని పేర్కొంటూ.. ఏ రక్త సంభందం లేకపోయినా కేవలం అభిమానం కోసం ప్రాణం ఇస్తారని విజయ్ సేతుపతి రుజువు చేశాడని పేర్కొన్నారు.

ఎదురించడానికి ధైర్యం ఉండాలి

ఎదురించడానికి ధైర్యం ఉండాలి

మన సంపద ఇంకొకడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే.. ఎదురించడానికి వయసు కాదు ధైర్యం ఉండాలి అని చిన్న పిల్లాడు చూపించాడని పేర్కొన్నారు. అలాగే ఒక ఆడపిల్ల మానం కాపాడటం కన్నా మా సంపద గొప్పది కాదు అని, అక్కడున్న ప్రజల్ని చూసి నేర్చుకోవచ్చని తెలిపారు.

బానిస బ్రతుకు బ్రతకడం కన్నా..

బానిస బ్రతుకు బ్రతకడం కన్నా..

ఒకరి క్రింద బానిస బ్రతుకు బ్రతకడం కన్నా స్వేచ్ఛ కోసం తల తెగిపడినా చివరి రక్తపు చుక్క వరకు పోరాడాలని నరసింహా రెడ్డిని చూసి నేర్చుకోవచ్చని ఈ పోస్టర్ లో చెప్పారు. ఇక ఈ వివరణ చూసి మళ్ళీ మళ్ళీ థియేటర్ల బాట పట్టేస్తున్నారట ఆడియన్స్.

సైరా కలెక్షన్ల సునామీ

సైరా కలెక్షన్ల సునామీ

మరోవైపు సైరా కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విడుదలైన 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసిన సైరా నరసింహా రెడ్డి ఈ దసరా సెలవులు ముగిసే సరికి సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X